Arshad Warsi: ఆయన ‘ప్రభాస్‌’ పాత్రను అన్నాడు.. నెటిజన్లు ఉతికి ఆరేస్తున్నారు!

ప్రభాస్‌ (Prabhas)  అంటే బాలీవుడ్‌లో కొంతమందికి ఎక్కడో చిన్న మంట ఉంటుంది. ఈ మాట మేం అనేది కాదు. ఆయన పాన్‌ ఇండియా స్టార్‌ అయినప్పటి నుండి, బాలీవుడ్‌ హీరోల కంటే ఆయన సినిమాలకు ఎక్కువ వసూళ్లు వచ్చినప్పటి నుండి ఆయన మీద అక్కడి విశ్లేషకులు, రిపోర్టర్లు చిర్రుబుర్రులాడుతూనే ఉన్నారు. అయితే ఏకంగా ఇప్పుడు బాలీవుడ్‌ నటుడే ఆయన మీద ఇబ్బందికర కామెంట్లు చేశారు. పాత్ర గురించి అన్నాం అని సమర్థించుకోవచ్చు కానీ.. అనడం అయితే అనేశాడు.

Arshad Warsi

మామూలుగా ఓ మాట అంటేనే మనం పడం. అలాంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన ‘కల్కి 2898 ఏడీ’  (Kalki 2898 AD) సినిమా గురించి, అందులో నటుల గురించి మాట్లాడితే ఎలా ఊరుకుంటారు చెప్పండి మన నెటిజన్లు, ప్రభాస్‌ ఫ్యాన్స్‌. అందుకే ఉతికి ఆరేస్తున్నారు. ఇక్కడ ప్రభాస్‌ను ఏమన్నాడు, ఎందుకున్నాడు అనేది వేరే విషయం. అసలు అంత పెద్ద స్టార్‌ పోషించిన పాత్ర గురించి ఎందుకు అన్నాడు అనేదే ప్రశ్నగా మారింది.

ఇక అసలు విషయానికొస్తే.. బాలీవుడ్‌ నటుడు, మనకు బాగా పరిచయం ఉన్న కమెడియన్‌ పాత్రగాడు అర్షద్‌ వార్సీనే  (Arshad Warsi)  ఈ మాటలు అన్నది. తాజాగా ఆయన ప్రభాస్‌పై చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి. అర్షద్‌ ఎవరో మీకు తెలిసే ఉంటుంది. తెలుగులో మనకు శంకర్‌ దాదా ‘ఏటీఎం’ ఎలాగో.. హిందీలో మున్నాభాయ్‌కి ‘సర్క్యూట్‌’ అలాగా. ఆ పాత్రను పోషించిందే అర్షద్‌ వార్సీ. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ సెలబ్రిటీలు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

నిర్మాతలు అభిషేక్‌ అగర్వాల్‌ (Abhishek Agarwal) , ఎస్‌కెఎన్‌ (Sreenivasa Kumar Naidu(SKN)) తదితరులు ఈ విషయంలో ఇప్పటికే స్పందించారు. వాళ్ల ఉనికిని కాపాడుకోవడం కోసమే ప్రభాస్‌పై ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అంటూ విమర్శించారు. ‘కల్కి 2898 ఏడీ’లో ప్రభాస్‌ పాత్ర జోకర్‌లా ఉందని అర్షద్‌ ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో కామెంట్స్‌ చేశాడు. దాని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ పాత్ర విషయంలో గతంలో ఈ తరహా కామెంట్స్‌ వచ్చినా అర్షద్‌ మాటలు పెద్ద వేదిక మీద రావడం ఈ పరిస్థితికి కారణం అని చెప్పొచ్చు.

కేజీఎఫ్3 మూవీ ఫ్యాన్స్ కు నిర్మాత అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus