KGF Chapter 3: కేజీఎఫ్3 మూవీ ఫ్యాన్స్ కు నిర్మాత అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ కు మరో షాక్!

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబోలో తెరకెక్కిన సలార్ (Salaar) మూవీ గతేడాది థియేటర్లలో విడుదలై 700 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ గా సలార్2 తెరకెక్కాల్సి ఉండగా వేర్వేరు కారణాల వల్ల సలార్2 అంతకంతకూ ఆలస్యమవుతోంది. ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ నీల్ కాంబో మూవీ షూట్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుండటంతో సలార్2 మూవీ ఇప్పట్లో లేనట్టేనని క్లారిటీ వచ్చేసింది.

KGF Chapter 3

అయితే కేజీఎఫ్3 (KGF Chapter 3) (KGF)మూవీ 2025 సంవత్సరం చివరి నుంచి సెట్స్ పైకి వెళ్తుందని ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ సైతం సిద్ధమైందని హోంబలే ఫిల్మ్స్ అధినేత విజయ్ కిరంగదూర్ (Vijay Kiragandur) నుంచి స్పష్టత వచ్చేసింది. ప్రశాంత్ నీల్ ఒక సినిమా పూర్తి చేసిన తర్వాతే మరో సినిమాతో బిజీ అవుతారనే సంగతి తెలిసిందే. వైరల్ అవుతున్న వార్తలను బట్టి సలార్2 2027 సంవత్సరంలో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది.

సలార్2 సినిమా కంటే ముందే కల్కి2 (Kalki 2898 AD) సినిమా విడుదలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సలార్2 మూవీ విషయంలో ప్రభాస్ ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో తెలియాల్సి ఉంది. ప్రభాస్ మీడియాకు, ప్రమోషన్స్ కు దూరంగా ఉండటంతో ప్రభాస్ సినిమాల విషయంలో గందరగోళం మాత్రం కొనసాగుతోందని తెలుస్తోంది.

ప్రభాస్ సినిమాలు విడుదలైన సమయంలో మాత్రం థియేటర్లు కళకళలాడుతున్నాయి. ప్రభాస్ సినిమాలు తొలిరోజే 150 కోట్ల రూపాయలకు అటూఇటుగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. ప్రభాస్ తో సినిమా తెరకెక్కించాలని ఆశ పడుతున్న యంగ్ డైరెక్టర్ల సంఖ్య సైతం పెరుగుతోంది. లైనప్ విషయంలో ప్రభాస్ కు తిరుగులేదని ఈ హీరోకు పోటీ ఇచ్చే హీరో లేరని ప్రభాస్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

రజనీకాంత్, సూర్య బాక్సాఫీస్ పోటీలో ఆ హీరో విజేతగా నిలుస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus