Arshi Khan: ‘బిగ్ బాస్’ బ్యూటీ అర్షి ఖాన్ పెళ్లి క్యాన్సిల్.. కారణం అదేనట..!

అఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల ఆక్రమణతో అఫ్ఘనిస్థాన్ ప్రజలు భయాందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే.ఓ విధంగా చెప్పాలి అంటే వాళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు అనే చెప్పాలి. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజలు దేశం వదిలి పారిపోయారు,ఇంకా అనేక మంది కాబుల్ ఎయిర్ పోర్ట్ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ‘ప్రపంచం మొత్తం అఫ్ఘనిస్థాన్ కోసం ప్రార్ధించాలి’ అంటూ సోనూసూద్ వంటి స్టార్లు కూడా ట్వీట్లు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘బిగ్ బాస్’ బ్యూటీ మరియు ప్రముఖ నటి అయిన అర్షి ఖాన్ ఆ దేశ క్రికెటర్ తో పెళ్లి క్యాన్సిల్ చేసుకునే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది.

ఆమె మాట్లాడుతూ.. “అఫ్ఘనిస్థాన్ కు చెందిన ఓ క్రికెటర్ తో నాకు పెళ్లి ఫిక్స్ అయ్యింది. నిశ్చితార్దానికి కూడా సన్నాహాలు జరిగాయి. కానీ ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయాలని నా తల్లిదండ్రులు భావిస్తున్నారు.ఆ అఫ్ఘనిస్థాన్ క్రికెటర్.. యొక్క తండ్రి మా నాన్న గారికి మంచి మిత్రుడు. ఎప్పటినుండో ఉన్న సాన్నిహిత్యం కారణంగా అతని కొడుకుతో నా పెళ్లి ఫిక్స్ చేశారు. అఫ్ఘనిస్థాన్ లో తాలిబన్స్ ఆక్రమణ కారణంగా నెలకొన్న భయాందోళన కారణంగా వారు

ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. నిజానికి ఈమె తండ్రి ఆఫ్ఘనిస్థాన్ కు చెందినవారే.. కొన్నేళ్ల క్రితం ఇండియాలో స్థిరపడ్డారు. అందుకే అఫ్ఘనిస్థాన్ కు చెందిన అబ్బాయిని అల్లుడిగా తెచ్చుకోవాలి అనుకున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus