‘గ్యారేజ్’ హీరో కోసం అంత కష్టపడ్డారా??

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన “జనతా గ్యారేజ్’ ఏ ముహూర్తాన ఇచట అన్నీ రేపేర్లు చేయబడును అన్న ట్యాగ్ తగిలించుకుందో తెలీదు కానీ, మొత్తానికి మిక్స్డ్ టాక్ తో మొదలై ఇప్పుడున్న రికార్డులను అన్నింటినీ రిపేర్స్ చేస్తుంది. అయితే అదే క్రమంలో ఈ సినిమాలో హీరో కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది అని చెబుతుంది చిత్ర యూనిట్. అదేంటి యాక్టింగ్ కి మారు పేరు అయిన ఎన్టీఆర్ విషయంలో అంత కష్ట పడాల్సి వచ్చిందా అని ఆశ్చర్య పోకండి…నేను చెప్పేది జనతా గ్యారేజ్ సినిమా అసలు హీరో ‘జనతా గ్యారేజ్’ గురించి. విషయం ఏమిటంటే….ఈ సినిమాకు అసలు హీరో మోహన్ లాల్, లేదా ఎన్టీఆర్ కాదంట. ఈ సినిమాకు మైన్ హీరో ఆ గ్యారేజ్ అంట అందుకే ఆ గ్యారేజ్ కోసం చాలా కష్ట పడాల్సి వచ్చింది అంటున్నాడు జనతా గ్యారేజ్ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్.

ఆయన చెబుతున్న మాటల ప్రకారం ఈ సినిమా సెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అని, ఏపీ తెలంగాణల్లో ప్రధానమైన నగరాల్లో ఆటోమొబైల్ గ్యారేజ్ లు అన్నిటికీ తిరిగేసి చివరకు సెట్ వేశాం అని అంతేకాకుండా ఈ సినిమా కొత్తం ఆ గ్యారేజ్ చుట్టూనే తిరుగుతూ ఉండడంతో ఎక్కడా తగ్గకుండా, అదే క్రమంలో నేచురల్ లుక్ ను కూడా స్యాటిస్ఫై చేస్తూ… అచ్చు మెకానిక్ షెడ్ లాగానే తీర్చి దిద్దాం. అంతేకాకుండా…ఆ గ్యారేజ్ లో ఉన్న చెట్టు గురించి సైతం మాట్లాడుతూ…సినిమా థీమ్ ప్రకారం దాదాపు 500 మొక్కలతో పాటు సెట్ లోపల ఓ పెద్ద వృక్షం ఉండేలా ప్లాన్ చేసుకున్నారట. మొదట ఓ నిజమైన వృక్షం చుట్టూనే సెట్ వేద్దామని అనుకున్నా.. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ట్రీ డిజైన్ చెయ్యాల్సి వచ్చింది అని తెలిపాడు మన ఆర్ట్ డైరెక్టర్. మొత్తానికి మన గ్యారేజ్ హీరో కధ ఇది అన్న మాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus