50 ఏనుగుల మధ్య రూ.5 కోట్లతో క్లైమాక్స్..!

రాఘవ దర్శకత్వంలో ఆర్య నటిస్తున్న తమిళ చిత్రం ‘కాదంబన్’. ఈ చిత్ర తదుపరి షెడ్యూల్ జూలై 1 నుంచి థాయ్ లాండ్ లో ప్రారంభం కానుంది. చియాంగ్ మై లో ఈ చిత్ర క్లైమాక్స్ ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. దాదాపు 50 ఏనుగుల మధ్య రూ.5 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్ర క్లైమాక్స్ ను తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం.

‘దాదాపు 300 ఏనుగుల నుంచి 50 ఏనుగులను ఎంపిక చేశారు. వీటిలో పన్నై అనేది థాయ్ లాండ్ లోనే పెద్ద ఏనుగు. ఈ చిత్రం షెడ్యూల్ కంటే ఒకవారం ముందుగానే ఆర్య, దర్శకుడు లు అక్కడికి వెళ్లనున్నారు. ముందుగా వెళ్లనున్న ఆర్య అక్కడ ఏనుగులను ఎలా అదుపులో పెట్టాలన్న దానిపై శిక్షణ తీసుకొనున్నాడు.

పది రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంద’ని చిత్ర బృందం లోని సభ్యుడొకరు తెలిపాడు. ఈ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిత్రబృందం తలకోన లో మిగిలిన క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ఆర్య సరసన్ కేథరిన్ తెరిసా జంటగా నటిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus