Ashu, Ariyana: ఇద్దరి మద్యలో ఫ్రెండ్షిప్ చెడిపోయిందా ? అషూ ఎందుకిలా చేసిందంటే..,

బిగ్ బాస్ ఓటీటీలో టాస్క్ లు చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా నాలుగోవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ అనేది మొదలు అయ్యింది. ఇందులో పోటీదారులు వివిధ ఛాలెంజస్ ని చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరివల్ల అయినా ఈ ఛాలెంజ్ తెలిస్తే మాత్రం వాళ్లు గేమ్ నుంచీ తప్పుకుంటారు. మొదటి ఛాలెంజ్ గా అరియానాని ఏడిపించాలి అని టాస్క్ వచ్చినపుడు అషూరెడ్డి నేను చేస్తానని ముందుకు వచ్చింది.

Click Here To Watch NOW

అనుకున్నట్లుగానే తనకిష్టమైన మొక్కని తీస్కుని వచ్చి అరియానాని ఏడిపించే ప్రయత్నం చేసింది. ఇక్కడే అషూరెడ్డి మట్టిని తీసుకుని అరియానా ముఖం మీద రాసింది. అరియానా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వాళ్లు చేసే చేష్టలని చూస్తూ ఉండిపోయింది. అషూరెడ్డి ఎంతగా రెచ్చగొట్టినా కూడా అరియానాలో చలనం లేకుండా చేసింది. ఇక లాభం లేదని మొక్కని పోస్ట్ బాక్స్ లో పెట్టారు. అయినా కూడా అరియానా స్పందించలేదు. కళ్లల్లో నీళ్లు తిరిగాయని , మేము టాస్క్ గెలిచామని బిగ్ బాస్ కి ఎనౌన్స్ మెంట్ చేశారు పోటీదారులు.

కానీ, అరియానా ఏడవలేదని బిగ్ బాస్ నిర్ణయించి టాస్క్ చేయడంలో మీరు విఫలం అయ్యారని చెప్పాడు. దీంతో పోటీదారులు షాక్ తిన్నారు. కానీ, అరియానా ఎండ్ బజర్ వచ్చిన తర్వాత, మొక్క చచ్చిపోయిందంటూ పోటీదారులని బ్లేక్ చేసింది. అంతేకాదు, కిచెన్ లోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చింది. నాకు ఫృద్వీ గుర్తుకు వస్తున్నాడని చెప్పింది. లాస్ట్ టైమ్ సీజన్ లో కూడా అరియానా ఇలా ఉన్నప్పుడు ఫృద్వీ పేరే పదే పదే చెప్పింది.

ఇప్పుడు కూడా తను ఏడుస్తూ నువ్వు పక్కనుంటే బాగుండని అనిపిస్తోంది ఫృద్వీ అంటూ కెమెరాకి చెప్పి ఏడ్చింది. టాస్క్ అయిన తర్వాత అషూరెడ్డి వచ్చి ప్యాచప్ చేసుకోవడానికి ప్రయత్నించింది కానీ, అరియానా కాసేపు నన్ను వదిలేసేయ్ అంటూ బ్రతిమిలాడింది. ఇద్దరి మద్యలో ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఈటాస్క్ వల్ల చెడిపోయింది. అంతేకాదు, ఇది తర్వాత వారం నామినేషన్స్ వరకూ వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే, టాస్క్ లో భాగంగా అరియానా బుగ్గలపైన, ముఖంపైన మట్టి పూసింది అషూ.

ఇక్కడే అఖిల్ అంతగా చేయద్దని వారించాడు. అయినా కూడా వినకుండా నా ఫ్రెండ్ నాతో మాట్లాడాలి అంతే అంటూ అషూ రెచ్చిపోయింది. ఆ తర్వాత అరియానా దగ్గరకి వచ్చి తన వెర్షన్ చెప్పుకున్నా కూడా లాభం లేకుండా పోయింది. మరి వీరిద్దరూ ఎప్పుడు కలుస్తారు. మళ్లీ ఇదివరకటి లాగా ఉంటారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus