Bigg Boss 7 Telugu: ప్రియాంక కోసం గేమ్ ఆడద్దు.. నీకోసం ఆడు..! అన్ సీన్ లో ఏంజరిగిదంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ జరుగుతోంది. ఇందులో భాగంగా ఒక్కో హౌస్ మేట్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి వారిని పలకరించి కాసేపు టైమ్ స్పెండ్ చేసి మరీ వెళ్తున్నారు. ఇక అమర్ కోసం వాళ్ల వైఫ్ తేజస్విని రాకకోసం వైయిట్ చేస్తున్నాడు. సడెన్ గా బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచాడు బిగ్ బాస్. అమర్ కి బర్త్ డే విషెష్ చెప్తూ కేక్ ని ఇచ్చాడు. ఈలోగా తేజస్విని మైయిన్ గేట్ లో నుంచీ వచ్చి హౌస్ మేట్స్ ని పలకరించింది. ఇక్కడే బిగ్ బాస్ మీ వైఫ్ రావడం లేదని, కేక్ మాత్రమే పంపించిందని ఆట పట్టించాడు.

డిస్సపాయింట్ తో హౌస్ లోకి వచ్చిన అమర్ కి ఎదురుగా వైఫ్ కనిపించింది. దీంతో సంబరపడిపోయాడు. అందరూ కలిసి కేక్ కట్ చేశారు. వాళ్ల ఎంగేజ్మెంట్ రింగ్ కూడా అమర్ కోసం తెచ్చి మరీ తొడిగింది. ఇక ఇద్దరూ సపరేట్ గా చాలాసేపు మాట్లాడుకున్నారు. గెలుపు – ఓటములు అనేవి సహజం. ఏది ఏయినా సరే ఎంతో ఎఫోర్ట్స్ పెట్టి ఆడావ్ అనేదే ముఖ్యం అంటూ చెప్పంది తేజు. ఇక తేజు ఫేస్ లో సంతోషం లేకపోవడంతో అమర్ కి – ప్రియాంకకి – శోభాకి అందరికీ అర్ధమైంది. అమర్ అయితే, నేను చాలా మారాను.

ఇక నుంచీ ప్రతి విషయంలో చాలా క్లారిటీతో ఉన్నా, బిగ్ బాస్ నాకు చాలా నేర్పిందంటూ మాట్లాడాడు. కొందరి విషయంలో కూడా నువ్వు చాలాసార్లు స్టాండ్ తీస్కున్నావ్ దానివల్ల నీ గేమ్ పాడైందంటూ చెప్పింది. ఇక్కడ ప్రియాంక అని పేరు చెప్పకపోయినా నామినేషన్స్ తర్వాత అదే జరిగింది. వాళ్లందరూ నీకోసం ఉండరు, కానీ నువ్వు మాత్రం వాళ్లకోసం ఉంటావ్, ఫైనల్ గా నిన్నే నామినేట్ చేస్తారని చెప్పింది. అలాగే, ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు. నీకోసం ఎవ్వరూ లేరు అని క్లియర్ గా చెప్పేసింది. ప్రియాంక విషయంలో ఎక్కువ అవుతోందని దానర్ధం.

స్టాండ్ తీస్కునేటపుడు జాగ్రత్త. వాళ్లకోసం స్టాండ్ తీస్కుని మాట్లాడావ్ అదే జాగ్రత్తగా చూస్కో అంటూ చెప్పింది. నువ్వు తెలియకుండానే ఇరుక్కుంటున్నావ్. అని క్లియర్ గా చెప్పింది. తేజస్విని వెళ్లిపోయాక ప్రియాంక – అమర్ – శోభా బెడ్ రూమ్ లో డిస్కషన్ పెట్టాడు. ప్రియాంక తేజు ముఖంలో చాలా డల్ నెస్ కనిపిస్తోందని చెప్పింది. దీంతో అమర్ ఒంట్లో బాలేదని చెప్పాడు. కాదు, ఏదో జరిగిందని, తన హగ్ లో కూడా జెన్యూనిటీ లేదని చెప్పింది. అంతేకాదు, అందుకే నేను కేక్ పెట్టడానికి కూడా రాలేదని అన్నది. బయట జరిగేది మనకి తెలియదు కదా, ఫేస్ లో తెలుస్తోందంటూ మాట్లాడింది.

అన్ సీన్ లో అయితే దీని గురించి చాలా సేపు మాట్లాడుకున్నారు. తేజస్విని బయట దానికోసం భయపడట్లేదు, నన్ను మిస్ అవుతున్నానని వణుకుతోందంటూ అమర్ చెప్పాడు. కానీ, చాలా డల్ గా వచ్చిందనే విషయాన్ని స్టార్ మా బ్యాచ్ నోటీస్ చేశారు. అంతేకాదు, ఆ తర్వాత శోభా మదర్ వచ్చినపుడు కూడా శివాజీ అండ్ బ్యాచ్ తో బాగా మాట్లాడటం కూడా నోటీస్ చేశారు. దీంతో వాళ్లకి కొన్ని విషయాల్లో క్లారిటీ వచ్చింది. తర్వాత యావర్ బ్రదర్ కూడా (Bigg Boss 7 Telugu) హౌస్ లోకి వచ్చాడు. అదీ విషయం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus