బిగ్ బాస్ హౌస్ నుంచీ ఎలిమినేట్ అయిన అషూ..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో అషూరెడ్డి అనూహ్యంగా ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. వీకండ్ నాగార్జున అరియానా, ఇంకా అషూరెడ్డి ఇద్దరినీ ఉంచి, అషూని ఎలిమినేట్ చేశారు. లాస్ట్ టైమ్ కూడా అరియానా, ఇంకా హమీదా ఇద్దరినీ నామినేషన్స్ లో లాస్ట్ వరకూ ఉంచి, హమీదాని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు కూడా అషూతో పాటుగా అరియానాని సైతం మరోసారి టెన్షన్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, అనిల్ రాధోడ్ సైతం డేంజర్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. మేల్ కంటెస్టెంట్ ని ఎవరినైనా ఈవారం ఎలిమినేట్ చేస్తారని, అనిల్ అందులో ఉంటాడని అనుకున్నారు అందరూ. కానీ, ఈసారి కూడా ఫిమేల్ కంటెస్టెంట్ నే ఎలిమినేట్ చేశారు. అంతేకాదు, ఎవిక్షన్ ఫ్రీ పాస్ సైతం తర్వాత వారానికి దాచినట్లుగా తెలుస్తోంది. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్ బాస్ ఆడియన్స్ అంచనాలు వేశారు. కానీ, సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరిగింది.
అషూరెడ్డి టాప్ – 5 లో ఉంటుందని అంచనా వేసుకుంది. ఇది మా అమ్మ కల అంటూ హౌస్ లో మాట్లాడింది కూడా. కానీ, ఇప్పుుడు టాప్ 5లో లేకుండానే వెళ్లిపోయింది. అరియనాని ఫస్ట్ టైమ్ నామినేట్ చేసిన అషూ లాజిక్ లేని పాయింట్స్ మాట్లాడింది. పీచ్ రూమ్ లో అఖిల్ కి దూరంగా ఉంటున్నావని ఎందుకు అన్నావ్ ? మా అమ్మ వచ్చినప్పటి నుంచీ అలా ఉన్నవని నువ్వు ఎందుకు అన్నావ్ అంటూ నిలదీసింది. నామినేట్ చేసింది. దీనికి అరియానా క్లారిటీ ఇచ్చినా కూడా ఇధ్దరికీ చాలారోజులు పడలేదు. అంతేకాదు, ఒకరిపై ఒకరు సెటైర్స్ కూడా వేసుకున్నారు. దీంతో అరియానా ఫ్యాన్స్ కి యాంటీ అయిపోయింది అషూ. అంతేకాదు, సోషల్ మీడియాలో అన్ అఫీషియల్ పోలింగ్స్ లో కూడా అషూ లీస్ట్ లోనే ఉంది. ఈవారం ఎవిక్షన్ ఫ్రీ పాస్ అఖిల్ సంపాదించి ఉంటే బహుశా అషూని సేఫ్ చేసి ఉండేవాడు ఏమో. కానీ, చేయలేదు. అలాగే, టాస్క్ విషయంలో కూడా అషూకి హెల్ప్ చేయలేదు అఖిల్. అరియానాకి పాస్ కోసం పోటీపడే అర్హతని ఇచ్చాడు. దీంతో అషూ బాగా ఫీల్ అయ్యింది. ఇప్పుడు అదే ఫీలింగ్ తో హౌస్ నుంచీ ఎలిమినేట్ అయ్యింది.
అషూరెడ్డి లాస్ట్ టైమ్ సీజన్ లో పెద్దగా గేమ్ ఆడింది లేదు. ఆ అవకాశం కూడా తనకి రాలేదు. త్వరగానే ఎలిమినేట్ అయ్యింది. కానీ, ఇప్పుడు ఆల్ మోస్ట్ టాప్ 5 వరకూ వచ్చింది. గేమ్ పరంగా కూడా పెద్దగా పెర్ఫామన్స్ ఇచ్చి, ఛాలెంజస్ గెలిచింది కూడా లేదు. అలాగే, సంచాలక్ గా కూడా విఫలం అయ్యింది అషూ. సరిగ్గా చూసుకోలేకపోయింది. దీంతో హౌస్ మేట్స్ అషూని నిందిస్తునే ఉన్నారు. అంతేకాదు, ఈసారి అషూ అర్ధం లేని పాయింట్స్ పై ఎక్కువగా ఆర్గ్యూ చేసింది. అందుకే, ఆడియన్స్ కి దగ్గర కాలేకపోయింది. ఒక వైపు గేమ్ ఆడలేదు, మరోవైపు లాజిక్స్ వర్కౌట్ చేయలేదు. అఖిల్, అజయ్ , నటరాజ్ మాస్టర్ ల గ్రూప్ లో ఉండిపోయింది. పైగా గతవారం బాత్రూమ్ లో స్మోక్ చేయడం అనేది కూడా ఆడియన్స్ తప్పుబట్టారు. ఆ వీడియోలు వైరల్ చేశారు. అందుకే అషూకి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది తగ్గింది. హౌస్ నుంచీ టాప్ 5లో లేకుండానే బయటకి వచ్చింది. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus