తమిళ దర్శకుడితో మూవీ చేయనున్న ఎన్టీఆర్

నాలుగు సినిమాలతో తమిళ దర్శకుడు అట్లీ స్టార్ డైరక్టర్ అయిపోయారు. అతని గత చిత్రం మెర్సల్ వివాదాల మీదుగా విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగులో అదిరిందిగా వచ్చి విజయం సాధించింది. ఇప్పుడు విజయ్ తోనే “తలపతి 63” అనే సినిమా తీస్తున్నారు. దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నట్లు తెలిసింది. సావిత్రి బయోపిక్ మహానటి విజయం తో వైజ‌యంతీ మూవీస్ సంస్థ పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంది. ఆ సంస్థ అధినేత అశ్వ‌నీద‌త్‌ ఎక్కువ సినిమాలు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా విజయ్ దేవరకొండతో హిందీ చిత్రం నిర్మించాలని అనుకున్నారు.

ఆ పనులు సాగుతున్నాయి. అలాగే ఎన్టీఆర్ తోను మళ్ళీ మూవీ చేయాలనీ డిసైడ్ అయ్యారు. గతంలో వీరి కాంబినేషన్లో శక్తి సినిమా వచ్చింది. ఆ మూవీ ఫెయిల్. అందుకే ఈసారి హిట్ కొట్టాలని భావిస్తున్నారు. అందుకే ఫామ్లో ఉన్న అట్లీని డైరక్టర్ గా ఫిక్స్ చేశారు. అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమాని ఎన్టీఆర్ చేస్తున్నారు. ఇది అక్టోబర్ 11 న రిలీజ్ కానుంది. దీని తర్వాత అట్లీ తో సినిమా పనుల్లోకి దిగనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus