త్రిష-విజయ్ లాగా వీళ్ళు కూడా మళ్ళీ కలిసి సినిమా చేస్తే ???

దళపతి విజయ్ చేయబోయే లోకేష్ కనగరాజ్ లియో సినిమాలో హీరోయిన్ గా త్రిష ని తీసుకున్నారు. గిల్లి, తిరుప్పాచ్చి, లాంటి సినిమాలతో తమిళంలో సూపర్ హిట్ జంటగా సినిమాలు చేసిన ఈ పెయిర్ ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల తరువాత సినిమా చేయడంతో మెమన్ తెలుగులో కొన్ని సూపర్ హిట్ జోడీలు రిపీట్ కావాలి అని కోరుకుంటున్నారు మన తెలుగు ఫ్యాన్స్.

ఇలా మన ఫ్యాన్స్ ఆశపడుతున్న సూపర్ హిట్ జోడిలు ఏంటో చూసి ఇందులో మీ ఫెవరెట్ జోడి ఎవరో కామెంట్ చేయండి …

1) ప్రభాస్ & త్రిష

వర్షం, పౌర్ణమి & బుజ్జిగాడు లాంటి సినిమాల్లో ఆక్ట్ చేసిన ప్రభాస్ -త్రిష ల జోడికి చాల ఫ్యాన్స్ ఉన్నారు. వర్షం, పౌర్ణమి సినిమాల్లో వీళ్ళ కెమిస్ట్రీ…చాల బాగుంటుంది. ఇక బుజ్జిగాడు సినిమాలో వీళ్ళ మధ్య లవ్ స్టోరీ చాల బాగుంటుంది …

2) పవన్ కళ్యాణ్ & భూమిక

ఖుషి సినిమా జోడి పవన్ కళ్యాణ్ & భూమిక అయితే చాల మంది ఫెవరెట్ జోడి. ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ…ఆ లవ్ ట్రాక్, ఇగో ఇప్పుడు చుసిన ముచ్చటగా అనిపిస్తుంది.

3) మహేష్ బాబు & త్రిష

అతడు, సైనికుడు సినిమాల్లో…మహేష్ బాబు తో కలిసి యాక్ట్ చేసింది త్రిష. ఈ రెండు సినిమాల్లో సైనికుడు ఏమో కానీ అతడులో అయితే ఇద్దరు బావ మరదలు గా భలే సెట్ అయ్యారు..ఇద్దరి మధ్య సీన్స్ కూడా ఆలా ఉంటాయి.

4) సిద్దార్థ్ & జెనీలియా

బొమ్మరిల్లు సినిమాలో సిద్దార్థ్ & జెనీలియా పెయిర్ చాల క్యూట్ గా ఉంటది. ఇద్దరు లవర్స్ ల భలే సెట్ అయ్యారు అండ్ ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు సినిమా చేస్తే బాగుంటది, ఎలాగో జెనీలియా రితేష్ తో సినిమా చేసి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

5) నాని – నిత్య మీనన్

అలా మొదలైంది, సెగ సినిమాల్లో నాని – నిత్య మీనన్ మధ్య కెమిస్ట్రీ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ సినిమాల తరువాత మళ్ళీ కలిసి పని చేయలేదు ఈ ఇద్దరు…కానీ కలిసి ఒక మంచి లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది.

6) నాని & సాయి పల్లవి

ఎం.సి.ఎ, శ్యామ్ సింగ రాయ్ సినిమాల్లో ఈ ఇద్దరి పెయిర్, ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా నాటురల్ గా ఉండింది…ఈ పెయిర్ కూడా మళ్ళీ రిపీట్ అయితే బాగుణ్ణు

7) విజయ్ దేవరకొండ & రష్మిక

గీత గోవిందం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఒక కారణం కథ అయితే … విజయ్ దేవరకొండ & రష్మిక ఇద్దరి మధ్య కెమిస్ట్రీ రెండో కారణం…మరి ఇలాంటి పెయిర్ రిపీట్ అయితే ఎవరికీ చూడాలని ఉండదు…

8) ప్రభాస్ & అనుష్క

ఇక ఈ జోడి గురించి చెప్పేది ఎం ఉంది…ది బెస్ట్ పెయిర్ ఇన్ టాలీవడ్…ఈ చొంబొ రిపీట్ అయితే డార్లింగ్ అండ్ స్వీటీ ఫ్యాన్స్ కి పండగే.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus