Allu Arjun: అల్లు అర్జున్ కి స్పెషల్ విషెష్ చెప్పిన డేవిడ్ వార్నర్?

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదలైంది అయితే ఈ సినిమా విడుదలై దాదాపు పది నెలలు కావస్తున్న ఇంకా ఈ సినిమాకి ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఇప్పటికీ పలుచోట్ల పుష్ప మేనియా కనపడుతూనే ఉంది. ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో హిట్ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాలో పాటలు, డైలాగులు ఎంత ఫేమస్ అయ్యాయో మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పుష్పరాజ్ గెటప్ వేశారు. ఈ ఏడాది జరిగిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ సైమా అవార్డ్స్ లో పెద్ద ఎత్తున పుష్ప సినిమా తన హవా చూపించిన విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా ఫిలింఫేర్ అవార్డులలో భాగంగా పుష్ప సినిమా క్లీన్ స్వీప్ చేయడంతో అభిమానులు సైతం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున అభిమానులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే క్రికెటర్ డేవిడ్ వార్నర్ తనదైన శైలిలో పుష్ప సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డేవిడ్ వార్నర్ ట్వీట్ చేస్తూ…ఫిలింఫేర్ అవార్డులకు అల్లు అర్జున్ పుష్ప సినిమా ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి నా అభినందనలు అని తెలియజేశారు.

ఇలా శుభాకాంక్షలు తెలుపుతూనే పుష్పరాజు గెటప్ లో ఉన్నటువంటి తన ఫోటోని షేర్ చేయగా ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్పరాజ్ గెటప్ లో డేవిడ్ వార్నర్ అచ్చం అల్లు అర్జున్ ని తలపిస్తున్నారని ఆయన పుష్పరాజ్ గెటప్ లో అద్భుతంగా ఉన్నారంటూ నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus