వరల్డ్ వైడ్‌గా ఉన్న మూవీ లవర్స్, సినీ ప్రేక్షకులు, సెలబ్రిటీస్, ప్రపంచ సినీ పరిశ్రమలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్న టైమ్ మరో 14 రోజుల్లో రాబోతోంది.. 2009లో వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్’ సీక్వెల్.. ‘అవతార్ 2 – ది వే ఆఫ్ వాటర్’ కోసం దాదాపు 13 ఏళ్ళ పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. డిసెంబర్ 16న సుమారు 160 భాషలలో ‘అవతార్ 2’ కనీవినీ ఎరుగని రీతిలో రిలీజ్ కాబోతుంది. ఇంతకుముందు ‘అవతార్ 2’ టీజర్‌తో శాంపిల్ చూపించిన డైరెక్టర్ ఇటీవలట్రైలర్‌తో మతిపోగొట్టేశారు.
అలాగే ‘అవతార్ 2’ న్యూ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫస్ట్ ట్రైలర్‌ని మించి.. దిమ్మతిరిగేలా ఉంది కొత్త ట్రైలర్.. విజువల్స్ సింప్లీ సూపర్బ్.. జేమ్స్ కామెరూన్ మరోసారి ప్రపంచ సినీ ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నారు. క్లుప్లంగా కథ చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది ట్రైలర్‌లో.. అసలు ఆయన ఊహకు దణ్ణం పెట్టెయ్యొచ్చు.. అంటూ మాట్లాడుకుంటున్నారు ప్రేక్షకులు.. ఇదిలా ఉంటే.. ‘అవతార్ 2’ సినిమాని కేరళ రాష్ట్రంలో బ్యాన్ చేస్తామని ప్రకటించి, షాక్ ఇచ్చారు.
మిగతా సినిమాలు యదావిధిగా ప్రదర్శితమవుతాయి కానీ ఒక్క ‘అవతార్ 2’ ని మాత్రమే నిషేదిస్తున్నామని ‘ది ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్‌ఈయూఓకే)’ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఎఫ్‌ఈయూఓకే అధ్యక్షుడు కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘కేరళ రాష్ట్రంలో సినిమాలను బ్యాన్ చేస్తామని చెప్పడం లేదు.. కానీ, లాభాల వాటాలపై చర్చలు సఫలం కాకపోవడంతో ‘అవతార్ 2’ చిత్రాన్ని మాత్రమే ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నాం..
థియేటర్స్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మధ్య సరైన ఒప్పందం కుదరలేదు..బయ్యర్లు ‘అవతార్ 2’ ఫస్ట్ వీక్ కలెక్షన్లలో 60 శాతం లాభాలు అడుగుతున్నారు. థియేటర్ల ఓనర్లు మాత్రం 55 శాతం లాభాలు మాత్రమే ఇస్తామని ఖరాకండిగా చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’.. అన్నారు.. ‘అవతార్ 2’ మలయాళం వెర్షన్ పరిస్థితి ఏంటనేదాని గురించి కొద్ది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముందని సమాచారం..