Avatar 2 Review: అవతార్2 సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • November 29, 2022 / 11:43 AM IST

సాధారణంగా కొన్ని సినిమాలు భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలవుతూ విడుదలకు ముందే కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ప్రేక్షకుల్లో అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ఈ మధ్య కాలంలో అలాంటి కథాంశంతో తెరకెక్కిన సినిమాలలో అవతార్2 మూవీ ఒకటి కావడం గమనార్హం. డిసెంబర్ నెల 16వ తేదీన రికార్డు స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి ఉండనుందని ప్రచారం జరుగుతోంది. అవతార్2 మూవీ బుకింగ్స్ విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తుండగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ గ్రహీత గిల్లెర్మో డెల్ టోరో అవతార్2 సినిమాను చూడటంతో పాటు ఈ సినిమాకు రివ్యూ ఇచ్చేశారు. ప్రేక్షకుల అంచనాలను డబుల్ చేసే విధంగా ఆయన కామెంట్లు ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. గిల్లెర్మో డెల్ టోరో స్పందిస్తూ అవతార్2 మూవీ ఎమోషన్స్ తో కూడుకున్న గొప్ప మూవీ అని అన్నారు. అవతార్2 మూవీ అత్యద్భుతమైన విజయం సాధిస్తుందని ఆయన కామెంట్లు చేశారు.

అవతార్2 మూవీ చూస్తున్న సమయంలో ఈ మూవీ పురాణ ఇతిహాసాన్ని చూస్తున్న విధంగా నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని గిల్లెర్మో డెల్ టోరో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సినిమాకు టికెట్లు బుకింగ్ చేసుకున్న వాళ్లు మరింత సంతోషించే విధంగా ఆయన కామెంట్లు చేశారు. అవతార్2 మూవీ రిలీజయ్యే సమయానికి అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

దక్షిణాది భాషల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను క్రియేట్ చేయగా ఆ రికార్డులు బ్రేక్ అయ్యేలా ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి అవతార్2 అదే స్థాయిలో ప్రేక్షకులను మెప్పించనుందో లేదో చూడాల్సి ఉంది. 16000 కోట్ల రూపాయల కలెక్షన్ల టార్గెట్ తో తెరకెక్కిన అవతార్2 ఆ అంచనాలను మించి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus