2009 లో వచ్చిన ‘అవతార్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ళ తర్వాత ‘ అవతార్ 2′(అవతార్ : ది వే ఆఫ్ వాటర్) వస్తుంది. జేమ్స్ కేమరూన్ రూపొందించిన ఈ హాలీవుడ్ చిత్రాన్ని వీక్షించాలని ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అవతార్ సీక్వెల్ ను జేమ్స్ కేమరూన్ ఏ రేంజ్లో చిత్రీకరించాడు. విజువల్స్ ఏ రేంజ్లో ఉంటాయి అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. ‘అవతార్’ కలెక్షన్లను ఈ మూవీ ఒక్క రోజులోనే బ్రేక్ చేసేయడం ఖాయమనే నమ్మకం కూడా జనాల్లో ఉంది.
డిసెంబర్ 16న అంటే రేపు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. అయితే తెలుగు ప్రేక్షకులు కూడా ఒరిజినల్ వెర్షన్ ను చూసేందుకు ఇష్టపడుతున్నారు. 3D బుకింగ్స్ నెవర్ బిఫోర్ అనే నమోదయ్యాయి. ఈ చిత్రం తెలుగు వెర్షన్ కు అవసరాల శ్రీనివాస్ సంభాషణలు రాయడం విశేషం. ఇదిలా ఉండగా.. ‘అవతార్ 2’ ఫ్యాన్స్ కు పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. విషయం ఏంటంటే.. రేపు రిలీజ్ కాబోతున్న అవతార్-2 మూవీ ఈరోజే ఆన్లైన్లో లీకైంది.
ఒక్కరోజు ముందే ‘అవతార్2’ టెలిగ్రామ్లో దర్శనమిచ్చింది.వందల కోట్లు పోసి తీసిన ఇలాంటి మూవీస్ ను పైరసీ రాయుళ్లు ఇలా ఇంటర్నెట్ లో పెట్టడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మేకర్స్ ఈ విషయంలో షాక్ కు గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమాని థియేటర్లోనే చూడ్డానికి ఇష్టపడుతున్నట్లు సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.