Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Videos » Avatar2: అత్యద్భుతమైన విజువల్స్‌తో అదిరిపోయిన ‘అవతార్ 2’ ట్రైలర్..!

Avatar2: అత్యద్భుతమైన విజువల్స్‌తో అదిరిపోయిన ‘అవతార్ 2’ ట్రైలర్..!

  • November 2, 2022 / 08:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Avatar2: అత్యద్భుతమైన విజువల్స్‌తో అదిరిపోయిన ‘అవతార్ 2’ ట్రైలర్..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్, సినీ ప్రేక్షకులు, సెలబ్రిటీస్, ప్రపంచ సినీ పరిశ్రమలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్న టైమ్ రానే వచ్చింది.. 2009లో వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్’ సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది.. ఈ సీక్వెల్ కోసం దాదాపు 13 ఏళ్ళ సమయం పట్టింది.. జేమ్స్ తన 67వ ఏట ఈ సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. డిసెంబర్ 16న సుమారు 160 భాషలలో ‘అవతార్ 2’ కనీవినీ ఎరుగని రీతిలో రిలీజ్ కాబోతుంది.

ఇంతకుముందు ‘అవతార్ 2’ టీజర్‌‌తో శాంపిల్ చూపించిన డైరెక్టర్ ఇప్పుడు ట్రైలర్‌తో మతిపోగొట్టేశారు. మరోసారి మైండ్ బ్లాంక్ అయ్యే జేమ్స్ కామెరూన్ స్టైల్ విజువలైజేషన్‌తో.. అవతార్ 2, ‘‘ది వే ఆఫ్ వాటర్’ అనే సూపర్బ్ థీమ్‌తో వస్తోంది.. ట్యాగ్ లైన్‌ని బట్టి కథంతా సముద్రంలో జరుగుతుందని అర్థమవుతుంది. ఫస్ట్ పార్ట్‌లో ప్రేక్షకులను పండోరా రాజ్యంలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఇప్పుడు అండర్ వాటర్‌లోనూ ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు. ట్రైలర్ అత్యద్భుతంగా ఉంది..

పండోరా రాజ్యంలోని ప్రజలు అక్కడ జరిగిన విధ్వంసం వల్ల మరోచోటికి వలస వెళ్లి సముద్రంలోనే ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, అక్కడే వారి పవిత్ర వృక్షాన్ని ఏర్పరుచుకుని పూజించడం వంటివి కనిపిస్తాయి… హీరో హీరోయిన్లు జేక్, నేయిత్రిల జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నట్లు చూపించారు. దీన్ని బట్టి ‘ది వే ఆఫ్ వాటర్’ లో పిల్లల పాత్రలకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందనిపిస్తోంది..

అలాగే తల్లిదండ్రుల ద్వారా పండోరా రాజ్యం గురించి తెలుసుకుని, వారి వారసత్వాన్ని, తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడే వారిగా చూపిస్తారని అర్థమవుతోంది.. జేక్ తన కొడుక్కి విలువిద్యలో శిక్షణనివ్వడం ట్రైలర్‌లో చూపించారు.. కళ్లప్పగించేలా చేసే అద్భుతాలు, రోమాలు నిక్కబొడుచుకునే సాహసాలు, బ్రహ్మాండమైన విజువల్స్, అందుకు తగ్గట్టుగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతీదీ హైలెట్‌గా నిలిచాయనే చెప్పాలి.. ‘అవతార్ 2’.. ‘ది వే ఆఫ్ వాటర్’ ట్రైలర్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Avatar2
  • #James Cameron
  • #Sam Worthington
  • #Sigourney Weaver
  • #Stephen Lang

Also Read

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

12 mins ago
Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

42 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

57 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

1 hour ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

4 hours ago
Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

5 hours ago
Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version