Avatar2: అత్యద్భుతమైన విజువల్స్‌తో అదిరిపోయిన ‘అవతార్ 2’ ట్రైలర్..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్, సినీ ప్రేక్షకులు, సెలబ్రిటీస్, ప్రపంచ సినీ పరిశ్రమలన్నీ ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్న టైమ్ రానే వచ్చింది.. 2009లో వచ్చిన విజువల్ వండర్ ‘అవతార్’ సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది.. ఈ సీక్వెల్ కోసం దాదాపు 13 ఏళ్ళ సమయం పట్టింది.. జేమ్స్ తన 67వ ఏట ఈ సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆయన వయసు 80 సంవత్సరాలు. డిసెంబర్ 16న సుమారు 160 భాషలలో ‘అవతార్ 2’ కనీవినీ ఎరుగని రీతిలో రిలీజ్ కాబోతుంది.

ఇంతకుముందు ‘అవతార్ 2’ టీజర్‌‌తో శాంపిల్ చూపించిన డైరెక్టర్ ఇప్పుడు ట్రైలర్‌తో మతిపోగొట్టేశారు. మరోసారి మైండ్ బ్లాంక్ అయ్యే జేమ్స్ కామెరూన్ స్టైల్ విజువలైజేషన్‌తో.. అవతార్ 2, ‘‘ది వే ఆఫ్ వాటర్’ అనే సూపర్బ్ థీమ్‌తో వస్తోంది.. ట్యాగ్ లైన్‌ని బట్టి కథంతా సముద్రంలో జరుగుతుందని అర్థమవుతుంది. ఫస్ట్ పార్ట్‌లో ప్రేక్షకులను పండోరా రాజ్యంలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఇప్పుడు అండర్ వాటర్‌లోనూ ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు. ట్రైలర్ అత్యద్భుతంగా ఉంది..

పండోరా రాజ్యంలోని ప్రజలు అక్కడ జరిగిన విధ్వంసం వల్ల మరోచోటికి వలస వెళ్లి సముద్రంలోనే ఓ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని, అక్కడే వారి పవిత్ర వృక్షాన్ని ఏర్పరుచుకుని పూజించడం వంటివి కనిపిస్తాయి… హీరో హీరోయిన్లు జేక్, నేయిత్రిల జంటకు ఓ కొడుకు, కూతురు ఉన్నట్లు చూపించారు. దీన్ని బట్టి ‘ది వే ఆఫ్ వాటర్’ లో పిల్లల పాత్రలకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుందనిపిస్తోంది..

అలాగే తల్లిదండ్రుల ద్వారా పండోరా రాజ్యం గురించి తెలుసుకుని, వారి వారసత్వాన్ని, తమ ఉనికిని కాపాడుకోవడానికి పోరాడే వారిగా చూపిస్తారని అర్థమవుతోంది.. జేక్ తన కొడుక్కి విలువిద్యలో శిక్షణనివ్వడం ట్రైలర్‌లో చూపించారు.. కళ్లప్పగించేలా చేసే అద్భుతాలు, రోమాలు నిక్కబొడుచుకునే సాహసాలు, బ్రహ్మాండమైన విజువల్స్, అందుకు తగ్గట్టుగా అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్.. ఇలా ప్రతీదీ హైలెట్‌గా నిలిచాయనే చెప్పాలి.. ‘అవతార్ 2’.. ‘ది వే ఆఫ్ వాటర్’ ట్రైలర్ వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతోంది..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!


‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus