Avatar2: అవతార్2 మూవీ తెలుగు రైట్స్ విలువ ఎంతో తెలుసా?

ఈ ఏడాది అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి థియేటర్లలో విడుదల కానున్న సినిమాలలో అవతార్2 సినిమా కూడా ఒకటి. అవతార్2 సినిమా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలవుతోంది. డిసెంబర్ 16వ తేదీన థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుండగా 160 భాషలలో ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం. అవతార్: ది వే ఆఫ్ వాటర్ పేరుతో అవతార్2 సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

అవతార్2 సినిమా టాక్ తో సంబంధం లేకుండా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులు ఏకంగా 120 కోట్ల రూపాయలు పలుకుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలో ఏ సినిమాకు జరగని స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతుండటం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

సూపర్ హిట్ టాక్ వస్తే ఈ సినిమా 150 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. అవతార్2 తొలిరోజే 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అవతార్2 కు పోటీగా విడుదలైన తెలుగు సినిమాలు భారీగా నష్టపోయే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అవతార్2 ఇతర భాషల హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులు తీసుకున్నారని బోగట్టా. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరికీ అవతార్ సినిమా నచ్చగా అవతార్2 సినిమా అంతకు మించి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవతార్ పార్ట్1 విడుదలై దాదాపుగా 13 సంవత్సరాలు అయినా ఈ సినిమాను ప్రేక్షకులు మరిచిపోలేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus