మొదటి రోజు రికార్డు సృష్టించిన ‘అవెంజర్స్’

‘అవెంజర్స్’ సిరీస్ పై ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు..! ఇక ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన చివరి ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’. ఏప్రిల్ 26 (నిన్న) ప్రపంచ వ్యాప్తంగా భారీ హై ఎక్సపెక్టేషన్స్ తో విడుదలై సూపర్ టాక్ ను సొంతం చేసుకుంది. పాజిటివ్ రివ్యూస్ ను సైతం సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద కల్లెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఈ చిత్రం ఇండియాలో కూడా భారీ కల్లెక్షన్లని వసూల్ చేయడం విశేషం. మొదటి రోజుకు గానూ అన్ని భాషల్లో కలిపి 53.10కోట్ల షేర్ ను రాబట్టింది. హాలీవుడ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్ళను రాబట్టిన చిత్రం ఇదే కావడం విశేషం.

అంతేకాదు మొదటి రోజు ఇండియాలో హైయెస్ట్ గ్రాసర్ ను రాబట్టిన చిత్రాల జాబితాలో మూడవ స్థానాన్నిదక్కించుకుంది. ఈ లిస్ట్ లో మొదటి ప్లేస్ డాకించుకుంది ‘బాహుబలి 2’. ఇక రెండవ స్థానంలో ‘2.0’ చిత్రం ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకూ టాప్ లో ఉన్న ‘అవతార్’ రికార్డులను ఫుల్ రన్ లో ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ చిత్రం బ్రేక్ చేసే దిశగా దూసుకుపోతుంది. ఇక మొదటి వీకెండ్, మరియు మొదటి వారంలో ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus