అల్లు అర్జున్ పై అవికా గోర్ కామెంట్స్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరో పదేళ్ళు పూర్తయినా.. డ్యాన్స్ అనగానే అందరికీ బన్నీ పేరే గుర్తొస్తుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. అంతలా చెరగని ముద్ర వేసేశాడు బన్నీ. ఆయన స్టెప్పులంటే చొక్కాలు చించుకుని థియేటర్లలో పూనకాలు వచ్చేలా అరిచే అభిమానులు మాత్రమే కాదు.. బన్నీ డ్యాన్స్ లకి సెలెబ్రిటీల్లో సైతం వీరాభిమానులు ఉన్నారు. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్, మలయాళం వంటి ఇండస్ట్రీలో కూడా బన్నీ డ్యాన్స్ ఇష్టపడే సెలబ్రిటీలు ఉన్నారు.

కుష్బూ లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా బన్నీ డ్యాన్స్ ల పై ప్రశంసలు కురిపించిన రోజులు ఉన్నాయి. అందుకు తగినట్టుగానే బన్నీ కూడా తన ప్రతీ సినిమాలోనూ కొత్తరకం స్టెప్ లు వేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంటాడు. ఈ విషయం గ్రహించే అనుకుంట.. ఓ హీరోయిన్ బన్నీతో డ్యాన్స్ అంటే తెగ కంగారు పడుతుంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ అవికా గోర్. ఇటీవల ఆమె పాల్గొన్న ఓ ప్రెస్ మీట్లో.. ‘అల్లు అర్జున్ తో కలిసి డ్యాన్సులు చేసే అవకాశం వస్తే చేస్తారా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా…. “అల్లు అర్జున్ తోనా.. నేనా.. పిచ్చేమైనానా? .. నా కాళ్ళు విరగ్గొట్టుకోమంటారా? బన్నితో డ్యాన్సులు చాలా కష్టం..!” అంటూ సరదాగా సమాధానం ఇచ్చి అందరినీ నవ్వించింది.

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus