హీరోయిన్ అవికా గోర్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుందని చాలా మంది అంటుంటారు. వాళ్ళు క్రేజ్ ను అనుభవిస్తున్న టైంలో సరైన సినిమాలు ఎంచుకోవాలి. దాంతో పాటు ఫిజిక్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అవకాశాలు రావు. అవి లేకపోతే ఇక వాళ్ళు ఫేడౌట్ అయిపోయినట్టే..! ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే.. ‘చిన్నారి పెళ్ళికూతురు’ ‌తో ఫేమస్ అయిన అవికా గోర్.. ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి చిత్రంతోనే హిట్ అందుకున్న ఈ బ్యూటీ మంచి నటి అని కూడా ప్రూవ్ చేసుకుంది. ఆ చిత్రం తరువాత ఈమె నటించిన..

‘సినిమా చూపిస్తా మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రాలు కూడా హిట్ అయ్యాయి. అయితే ఆ తరువాత ఈమె ఊహించని విధంగా కాస్త ఒళ్ళు చేసింది.దాంతో ఈమెను పక్కన పెట్టారు మన టాలీవుడ్ దర్శకనిర్మాతలు.ఈ విషయాన్ని తలుచుకునో ఏమో కానీ అవికా గోర్.. తాజాగా చాలా ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “లాస్ట్ ఇయర్ ఒక రోజు రాత్రి వేళ నన్ను నేను అద్దంలో చూసుకుని చాలా ఏడ్చేశాను. ఆ రోజుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ టైములో నా శరీరం నాకు అస్సలు నచ్చలేదు. నేను తగినంత గౌరవం దానికి ఇవ్వలేదని అర్ధమయ్యింది. అందుకే లావైపోయుంటాను.

ఆ విషయంలో చాలా సార్లు బాధపడ్డాను. ఆ టైములో నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నాకు అర్ధమయ్యింది ఏమిటంటే… ఒక్క రాత్రిలో ఏది మారిపోదు. మంచి ఆహారం తీసుకున్నాను.. వర్కవుట్ల చేశాను.ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా నేను వెనకడుగు వెయ్యలేదు.నా చుట్టూ ఉన్న వాళ్లు కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ఈరోజు నేను చాలా తగ్గాను. ఈ రోజు మళ్లీ అద్దంలో నన్ను నేను చూసుకుని ఎంతో ఆనందంగా ఉన్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus