హిట్ సినిమా అనిపించుకున్న (?) సినిమాలకు సీక్వెల్ చేయడానికి కూడా హీరో, దర్శకులు, నిర్మాతలు ముందుకు రాని రోజులు ఇవి. రీసెంట్ టైమ్స్‌లో ఓ సినిమా విషయంలో మనం ఈ విషయం చూశాం. కానీ బాలీవుడ్‌లో ఓ సినిమా టీమ్ ఓ డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ చేసింది. అందులో 19 ఏళ్ల తర్వాత ఆ సినిమాను తీసుకొచ్చారు. ఇలాంటి సినిమా మీద ఎవరికీ నమ్మకాలు ఉండవు. కానీ ఆ సినిమా టీమ్ నమ్మింది. ఆ నమ్మకం విలువ రూ.200 కోట్ల వసూళ్లు. అవును మేం చెబుతున్నది ‘ఆవారాపన్ 2’ సినిమా గురించే.
ఇమ్రాన్ హష్మి, శ్రియా శరణ్ జోడీగా జంటగా 2007లో ‘ఆవారాపన్’ అనే సినిమా వచ్చింది. విషాద ప్రేమకథ స్పెషలిస్ట్ మోహిత్ సూరి ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమాకు తొలుత పాజిటివ్ రివ్యూలే వచ్చినా ఆ తర్వాత ఆ మాట కొనసాగలేదు. ఆ సినిమా బాక్సాఫీసు దగ్గర విజయం సాధించలేకపోయింది. రూ.18 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమాకు రూ.12 కోట్లు మాత్రమే వచ్చాయి. అయితే మన ‘అతడు’ సినిమాలాగా ఈ సినిమాకు టీవీలో మంచి విజయం, టాక్ వచ్చాయి.
ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే ఇన్నేళ్ల తరువాత ‘ఆవారాపన్ 2’ అంటూ ఇటీవల సినిమా సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తొలి పార్ట్‌కి కల్ట్ స్టేటస్ వచ్చేయడంతో ఈ సినిమా మీద కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమాకు ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లు వసూళ్లు అందుకుంది. దీంతో ఫ్లాప్ సినిమా సీక్వెల్‌కు ఇంత వసూళ్లా అని ఆశ్చర్యపోతున్నారు.