అ! మూవీ థియేట్రికల్ ట్రైలర్ | నాని, నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, ర‌వితేజ

న‌టుడిగా కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేసిన నాని తొలిసారి వాల్ పోస్టర్ అనే బేనర్ పై అ అనే ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రం నిర్మిస్తున్న‌ సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, రెజీనా, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక్కో టీజ‌ర్ విడుదల వచ్చాడు నాని. ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. అ చిత్రంలో చేప పాత్ర‌కి నాని వాయిస్ ఓవ‌ర్ ఇస్తుండ‌గా, చెట్టు పాత్రకి ర‌వితేజ వాయిస్ ఓవ‌ర్ ఇస్తున్నాడు. విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న అ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుండగా, ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రాహకుడిగా పనిచేస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus