గణతంత్ర దినోత్సవం సందర్భంగా అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలు విడుదలవుతుండగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కెప్టెన్ మిల్లర్ సినిమాకు సంబంధించి ఈ నెల 25వ తేదీ నుంచి పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం అవుతుండగా అయలాన్ మాత్రం 26వ తేదీనే రిలీజ్ కానుంది. ఈ రెండు సినిమాలకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ జరగలేదు. పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే ఈ సినిమాలకు బుకింగ్స్ పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి.
తమిళంలో సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ సినిమాలు థియేటర్ల సమస్య వల్ల తెలుగులో ఆలస్యంగా విడుదలవుతున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజైన సినిమాల హవా తగ్గడంతో అయలాన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలకు థియేటర్లు భారీ స్థాయిలోనే దక్కాయి. అయలాన్, కెప్టెన్ మిల్లర్ కలెక్షన్ల విషయంలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయలాన్, కెప్టెన్ మిల్లర్ (Ayalaan , Captain Miller) సినిమాలు ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కాయి.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాల హక్కులను సొంతం చేసుకోవడం గమనార్హం. కొన్ని ఏరియాలలో మాత్రం పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమాలు విడుదలవుతూ ఉండటం గమనార్హం. టాక్ ఆధారంగా ఈ సినిమాలకు థియేటర్లు పెరిగే, తగ్గే ఛాన్స్ ఉంటుంది. ధనుష్, శివ కార్తికేయన్ తెలుగు మార్కెట్ కు ఈ సినిమాలు ఎంతో కీలకమని చెప్పవచ్చు. ఇతర సినిమాలతో పోలిస్తే సైంధవ్ సినిమాకు థియేటర్లు ఎక్కువగా తగ్గాయని తెలుస్తోంది.
హైదరాబాద్ నగరంలో సైతం ఈ సినిమాకు థియేటర్లు ఎక్కువగా లేవు. 26వ తేదీ సెలవు దినం కావడంతో హనుమాన్ మూవీ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. మరికొన్ని రోజుల పాటు హనుమాన్ మూవీకి కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లాంగ్ వీకెండ్ ను హనుమాన్ ఏ స్థాయిలో క్యాష్ చేసుకుంటుందో చూడాలి. హనుమాన్ మూవీ 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఖాయమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.