శివ కార్తికేయన్ నటించిన ‘అయలాన్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు రావాలి. వాస్తవానికి నిన్న నైట్ నుండే ప్రీమియర్ షోలు వేయడానికి చిత్ర బృందం రెడీ అయ్యింది. కానీ ఊహించని విధంగా ప్రీమియర్స్ క్యాన్సిల్ అయ్యాయి. ఇక ఈరోజు అనగా జనవరి 26 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. రిలీజ్ కాలేదు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి ఆర్. రవికుమార్ దర్శకుడు. ‘కె జె ఆర్ స్టూడియోస్’ బ్యానర్ పై కోటపాడి జె. రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ‘గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్’ సంస్థ ద్వారా మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఊహించని విధంగా షోలు అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. టికెట్ బుక్ చేసుకున్న ప్రేక్షకులకి డబ్బులు తిరిగి చెల్లించాయి బుక్ మై షో వంటి పోర్టల్స్. అయితే ఇంటర్నెట్ ఛార్జీలు, జీఎస్టీ..లు వంటివి కాకుండా డబ్బులు రిటర్న్ ఇవ్వడం జరిగింది అని సమాచారం.
మరోపక్క అసలు ‘అయలాన్’ (Ayalaan) రిలీజ్ క్యాన్సిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆర్థిక లావాదేవీలే అని తెలుస్తుంది. అవి కనుక సెటిల్ అయిపోతే ఈరోజు నైట్ షోలు పడే ఛాన్స్ ఉంది. అయలాన్ అనే కాదు శివ కార్తికేయన్ నటించిన సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్న టైంలో ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతూ ఉంటాయి.
మరోపక్క ఈరోజు రిపబ్లిక్ డే హాలిడే ని కూడా ఈ సినిమా వృధా చేసుకున్నట్టు అయ్యింది. ఈరోజు కనుక రిలీజ్ చేసి ఉంటే.. తప్పకుండా మంచి కలెక్షన్స్ వచ్చి ఉండేవి. టాక్ బాగుంటే.. శని,ఆది వారాల కలెక్షన్స్ తో సినిమా సేఫ్ అయ్యేది.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!