తెలుగు సినిమా రీమేక్ ని తెలుగులో డబ్బింగ్ చేస్తారట!
- April 26, 2016 / 10:15 AM ISTByFilmy Focus
అదో సూపర్ హిట్ తెలుగు సినిమాకి రీమేక్ గా రూపొందిన బాలీవుడ్ సినిమా. అయితే.. బాలీవుడ్ స్టాండర్డ్స్ కు తగ్గట్లుగా కథలో చిన్నా చితక మార్పులు చేసి తెరకెక్కించారు. అందులో ఒక తెలుగు హీరో విలన్ గా నటించాడన్న ఏకైక కారణం చేత సదరు తెలుగు రీమేక్ చిత్రాన్ని మళ్లీ తెలుగు అనువాద రూపంలో విడుదల చేయాలనుకొంటున్నారు. ఆ హిందీ సినిమా పేరు “భాగి”.
తెలుగులో సూపర్ హిట్టయిన “వర్షం”కు రీమేక్ గా తెరకెక్కుతున్న “భాగి” చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో మళ్లీ డబ్బింగ్ చేయనున్నారు. అందుకు కారణం ఈ సినిమాలో మహేష్ బాబు బామ్మర్ది అయిన సుదీర్ బాబు ప్రతినాయకుడిగా నటించడమే. మరి తెలుగు సినిమాకు రీమేక్ అయిన “భాగి” హిందీ డబ్బింగ్ ను తెలుగు ప్రేక్షకులు అసలు చూస్తారో లేదో చూడాలి!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus












