ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేసిన బాహుబలి కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా 1076 స్క్రీన్లలో 50 రోజులు పూర్తి చేసుకొని.. ఈ రికార్డ్ సృష్టించిన తొలి భారతీయ సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. అంతేకాదు 1,684 కోట్ల కలక్షన్ వసూలు చేసి 1,700 కోట్ల మార్క్ ని చేరుకోవడానికి దూసుకుపోతోంది. ఈ సినిమా 2000 కోట్ల మార్క్ కూడా రీచ్ అవుతుందని చైనా డిస్ట్రిబ్యూటర్ అలెన్ లూయి చెబుతున్నారు. ఈ స్టార్స్ ఫిలిమ్స్ కి అధినేత అయిన ఈయన బాహుబలి కంక్లూజన్ ని చైనాలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు. ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు అలెన్ లూయి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర సంగతులు వెల్లడించారు.
బాహుబలి 2 ని సెప్టెంబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇదివరకు ఏ ఇతర భాషా చిత్రం రిలీజ్ కానీ రీతిలో 4000 తెరలపై విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. దాదాపు 44 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని, దీంతో 2000 కోట్ల రికార్డ్ ని నెలకొల్పుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకోసం బాహుబలి చిత్రం బృందం వచ్చే నెల నుంచి భారీగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అలెన్ లూయి తెలిపారు. ఈ లెక్కన దంగల్ టోటల్ కలక్షన్స్ ని బాహుబలి 2 బీట్ చేయడం గ్యారంటీ.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.