బాహుబలి క్లైమాక్స్‌ షూట్‌ షురూ

జక్కన్న శంఖం పూరించారు. సూర్యుడు కంటే ముందే బాహుబలి సైన్యం యుద్ధానికి బయలుదేరింది. తెలుగు సినిమాలకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చి పెట్టిన బాహుబలి (ది బిగినింగ్‌)కి కొనసాగింపుగా వస్తున్నబాహుబలి-ది కన్‌క్లూజన్‌’ క్లైమాక్స్‌ షూట్‌ షురూ అయింది. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, హీరో ప్రభాస్, విలన్ రానా తో బాటు సాంకేతిక నటులు సోమవారం ఉదయమే షూటింగ్ స్థలానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని ఫోటోలతో సహా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్ లో నేటి నుంచి 10 వారాల పాటు పోరాట సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇప్పటికే జాతీయ అవార్డ్ తో అన్నో అవార్డ్ లు సొంతం చేసుకున్న బాహుబలి (ది బిగినింగ్‌).. ఆదివారం జరిగిన మా టీవీ అవార్డ్స్ వేడుకలో ఏకంగా 13 అవార్డ్ లను కొల్లగొట్టింది. ఈ అవార్డ్ లు చిత్ర బృందానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది. వచ్చే ఏడాది ఏప్రిల్ కి బాహుబలి – ది కంక్లూజన్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి రాజమౌళి ప్రయత్నిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus