భాష, ప్రాంతం అని లేకుండా బాహుబలి సినిమాని ప్రతి ఒక్కరూ ఆదరించారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, నాజర్, రమ్యకృష్ణ తదితరులు అద్భుతంగా నటించిన ఈ చిత్రం మనదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో విజయం సాధించింది. ముఖ్యంగా జపాన్ అభిమానుల నుంచి అయితే సినిమాకు మంచి క్రేజ్ దక్కుతోంది. ఇక్కడ వందరోజులు కంప్లీట్ చేసుకున్న బాహుబలి కంక్లూజన్ టోక్యో లో ఇంకా కొన్ని థియేటర్స్ లో సినిమా ప్రదర్శించబడుతోంది. సినిమా రూపంలోనే కాకుండా వీడియో గేమ్స్, కామిక్ కథలతోను దగ్గరవుతోంది. అందుకే అక్కడి అభిమానులను దృష్టిలో ఉంచుకొని జపాన్ లోని ప్రముఖ పబ్లిషర్స్ గెంతోషా మంగ కామిక్స్ ని రిలీజ్ చేశారు.
మొదటి కాపీలను బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ, రానా మరియు చిత్ర దర్శకుడు రాజమౌళి చేతుల మిధులుగా రిలీజ్ చేయించారు. ఇండియాలో నవలల పరంగానే కాకుండా వెబ్ సిరీస్ ద్వారా కూడా బాహుబలి అత్యధికంగా ప్రాచుర్యం పొందుతోంది. జపాన్ కామిక్స్ కూడా తెలుగులో అనువదించి పబ్లిష్ చేయడానికి కొంతమంది పబ్లిషర్స్ ఆసక్తికనబరుస్తున్నారు. ఇలా బాహుబలి ఇంకెన్ని రూపాల్లో అభిమానులకు దగ్గరవుతుందో చూడాలి.