మూడు కేటగిరీల్లో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న బాహుబలి 2.!

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి బిగినింగ్ జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన బాహుబలి కంక్లూజన్ కూడా జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సారి మూడు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. 65 వ జాతీయ అవార్డుల్లో ఘాజి ఉత్తమ చిత్రంగా నిలవగా బాహుబలి కంక్లూజన్ ఉత్తమ ప్రజాధారణ పొందిన సినిమాగా అవార్డు అందుకుంది. ఇంకా బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాల్లోనూ అవార్డులు కైవశం చేసుకుంది. ప్రభాస్ అద్భుతంగా నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

రీసెంట్ గా జపాన్ లోను వందరోజుల వేడుక పూర్తి చేసుకుంది. అనేక గౌరవాలు, అవార్డులు అందుకున్న ఈ సినిమాకి జాతీయ అవార్డులు రావడం రాజమౌళి బృందానికి మరింత ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం ప్రభాస్ యువ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. రాజమౌళి మాత్రం రామ్ చరణ్, రామారావులతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ అవార్డులు రావడంపై వారి స్పందనను త్వరలోనే ఫిల్మీ ఫోకస్ మీకు అందించనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus