దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన “బాహుబలి : బిగినింగ్” ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా కలక్షన్స్ వసూలు చేసి రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి కంక్లూజన్ రిలీజ్ కి ముందే వ్యాపారం అదరహో అనిపిస్తోంది. మొదటి పార్ట్ కంటే రెండవ పార్ట్ 30 శాతం ఎక్కువ వసూళ్లు సాధిస్తుందని మీడియాతో రాజమౌళి ధీమాగా చెప్పడంతో డిస్ట్రిబ్యూటర్లు హక్కులకోసం ఎగబడుతున్నారు. బాహుబలి 2 షూటింగ్ ఇంకా కంప్లీట్ కాకముందే ప్రీ బిజినెస్ జోరు అందుకుంది.
మొన్న 40 కోట్లు చెల్లించి అమెరికా థియేటర్ హక్కులను ఓ సంస్థ సొంతం చేసుకుంది. తాజాగా నైజాం ఏరియా హక్కులు కూడా భారీ మొత్తంలో అమ్ముడుపోయింది. ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ తన బృందంతో కలసి ఈ నైజాం హక్కులను 45 కోట్లకు తీసుకున్నట్టు సమాచారం. ఇంత మొత్తంలో కొనుగోలు చేయడంపై ట్రేడ్ వర్గాల వారు సైతం ఆశ్చర్య పోతున్నారు. రెండు పాటల మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న విడుదల కానుంది.