బాహుబలి2 కధ ఇదేనా???

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ రాజమౌళి సందించిన టెక్నికల్ అస్త్రం బహుబలి. ఈ చిత్రంలో ఏక కాలంలో దాదాపుగా 3 బాషల్లో విడుదలయ్యి. ఆయా పరిశ్రమల్లో ఇప్పటికీ టాప్ మూవీగా కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా కలెక్షన్స్ విషయంలోనూ ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చ్సింది. ఇదిలా ఉంటే దాదాపుగా తొలి భాగానికే 600కోట్ల రూపాయల కలెక్షన్స్ రావడంతో బాహుబలి-2పై అంచనాలు భారీగా పెరిగాయి. తొలి భాగంలో బాహుబలి కుమారుడు శివుడు కధతో సినిమాను నడిపించిన దర్శకుడు రాజమౌళి, ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేందుకు, రెండో భాగంపై అంచనాలను పెంచేందుకు సినిమా లాస్ట్ సీన్ లో బాహుబలికి సాక్షాత్తూ భక్తుడి లాంటి కట్టప్ప చేతనే బాహుబలిని వెన్నుపోటు పొడిచి ఛంపినట్లు చూపించాడు. ఇక అప్పుడు మొదలు సోషియల్ నెట్‌వర్కింగ్ సైట్స్ లో ఈ సినిమా  కధపై ఎక్కడో ఒక చోట చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇదే క్రమంలో ఈ సినిమాపై ఈ సినిమా కధా రచయిత విజయేంద్ర ప్రసాద్ పెదవి విప్పాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అన్న వాదనకి సమాధానం ఇస్తాడేమొ అని అనుకున్న వారిని మరింత సందిగ్ధంలో పడేశాడు రచయిత. ఇంతకీ ఆయన చెప్పిన విషయం ఏంటంటే…‘బాహుబలి’ని తాను చంపానని కట్టప్ప చెప్పినప్పటికీ ఇదంతా ఊహ కావచ్చు అని, అంతేకాకుండా బాహుబలి బతికి వుండొచ్చేమో అంటూ కొత్త కన్ఫ్యూషన్ రేకెత్తిస్తున్నాడు రచయిత. ఒకవేళ రచయిత చెప్పిందే నిజం అయితే…‘బాహుబలి’ ఎక్కడున్నాడు? ఒకవేళ కట్టప్ప అంతటి ఘోరం తలపెడితే, దేవసేన కట్టప్పను ఎందుకు నమ్ముతూనే వచ్చింది. అక్కడ ఏదో లాజిక్ ఉంది. మరి రచయిత మాట ఎలా ఉన్నా, రెండో భాగంలో మన జక్కన్న ఏం చేస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus