తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 వీకెండ్ కలక్షన్స్ అదరహో
- May 1, 2017 / 06:59 AM ISTByFilmy Focus
“అమోఘమైన ఉద్వేగ భరిత సన్నివేశాలు… అద్భుత దృశ్య కావ్యం…” బాహుబలి కంక్లూజన్ గురించి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రుడి చెప్పిన మాట ఇది. సినిమా చూసిన ప్రతిఒక్కరి నోటా ఇదే వినిపిస్తోంది. అందుకే వీకెండ్స్ కలక్షన్స్ అదరహో అనిపించింది. రాజమౌళి వెండితెరపై చెక్కిన అపురూపం శిల్పం బాహుబలి 2 శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా 9,000 తెరలపై విడుదలై సంచలనం సృష్టిస్తోంది. దేశ వ్యాప్తంగా 6,500 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ ఈ వసూళ్ల వర్షం కురిపించింది.
కేవలం మనదేశంలోనే ఒక్కరోజులో 125 కోట్ల గ్రాస్ రాబట్టి ఔరా అనిపించింది. ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ మొత్తానికి 300 కోట్లు (గ్రాస్) దాటి పరుగులు తీస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న వివరాల ప్రకారం మూడు రోజుల్లో 74. 30 కోట్లు షేర్ రాబట్టుకుంది. ఏరియాల వారీగా షేర్ వివరాలు…
ఏరియా కలెక్షన్లు
నైజాం : 19 కోట్లు
సీడెడ్ : 12. 50 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర) :9. 28 కోట్లు
ఈస్ట్ : 8.72 కోట్లు
వెస్ట్ : 7. 51 కోట్లు
క్రిష్ణా : 5.25 కోట్లు
గుంటూరు : 8. 84 కోట్లు
నెల్లూరు : 3. 31 కోట్లు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















