దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అపూర్వ సృష్టి బాహుబలి. హీరోకి, డైరెక్టర్లకి మాత్రమే కాదు.. ప్రత్యేకంగా ఈ సినిమాకు అభిమానులు ఏర్పడ్డారు. అటువంటి వారిని అలరించేందుకు బాహుబలి : ద లాస్ట్ లెజెండ్స్ పేరిట యానిమేటెడ్ చిన్న చిత్రాలను రూపొందించారు. గ్రాఫిక్ ఇండియా, ఆర్కా మీడియా, అమెజాన్ ప్రైమ్ వీడియో తో కలిసి రాజమౌళి నిర్మించిన ఈ సీరీస్ ని వచ్చే ఏడాది ఒక్కొక్కటిగా ఆన్ లైన్లో రిలీజ్ చేయనున్నారు.
వీటి గురించి దర్శకధీరుడు మీడియాతో మాట్లాడుతూ “బాహుబలి కథను సినిమాలో కొంత మాత్రమే చూపించాం. వెండి తెర పైన చెప్పలేక పోయిన అనేక విషయాలను మీరు ఈ సీరీస్ ద్వారా చూడొచ్చు. ఇందులో స్టోరీ, యాక్షన్, డ్రామా అన్నీ ఉంటాయి” అని స్పష్టం చేశారు. “బాహుబలి కథను రాసుకున్నప్పుడు మహిస్మతి రాజ్యంలో ప్రతి ఒక్కరి గురించి వివరంగా రాసుకున్నాం. వారు ఎక్కడినుంచి వచ్చారు? రాజ్యంలో వారి పనులు ఏమిటి.. ఇలా ప్రతి ఒక్కరికీ పెద్ద స్టోరీ ఉంటుంది” అని రాజమౌళి బాహుబలి : ద లాస్ట్ లెజెండ్స్ సిరీస్ గురించి వెల్లడించారు.
https://www.youtube.com/watch?v=jsf7RtDAc4E