చైనాలో పెరుగుతున్న బాహుబలి కంక్లూజన్ కలక్షన్స్

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన వెండితెర కళాఖండం బాహుబలి కంక్లూజన్ గత ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ అయి 1700 కోట్లు వసూలు చేసి ఔరా అనిపించింది. జపాన్ భాషలోనూ వందరోజులు పూర్తి చేసుకొని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డ్యూయల్ రోల్ చేసిన ఈ చిత్రం మే 4 చైనా లో 7000 స్క్రీన్లలో రిలీజ్ అయి రికార్డు సృష్టించింది. అలాగే 2.5 లక్షల డాలర్ల ప్రీ రిలీజ్ చేసి ఆశ్చర్యపరిచింది. తొలిరోజే సుమారు 2.85 మిలియన్ డాలర్లును కొల్లగొట్టి టాప్ ఓపెనింగ్స్ అందుకున్న ఈమూవీ తాజాగా మరో మార్క్ ని క్రాస్ చేసింది. తొలి వీకెండ్ లోనే 7 మిలియన్లను రాబట్టిన ఈ చిత్రం ఆ తర్వాతి రోజుల్లో 3 మిలియన్లను వసూలుచేసి ఇప్పటి వరకు 10 మిలియన్ డాలర్లను ఖాతాలో వేసుకుంది.

బాలీవుడ్ మిస్టర్ పెర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమా ‘దంగల్’ సినిమా కలక్షన్స్ తో పోల్చుకుంటే తక్కువ అయినప్పటికీ తెలుగు సినిమాకి ఇది గొప్ప రికార్డుగానే సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాలో బాహుబలి 2 కి ఆశించినంత స్పందన లేకపోయినప్పటికీ లాంగ్ రన్ లో వందకోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభాస్ కి అక్కడ అభిమానులు పెరిగే అవకాశం ఉంది. అందువల్ల సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాని కూడా భారత్, చైనాలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus