టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి మన టాలీవుడ్ స్థాయిని అమాంతంగా పెంచేసాడు. తాను తీసిన ప్రతీ సినిమా హిట్ గా నిలిపి ఒక సరికొత్త రికార్డుకు శ్రీకారం చుట్టాడు. అయితే అదంతా పాత కధ. ఇప్పుడు నడుస్తున్న మ్యాటర్ చూస్తే సరికొత్త విషయాలు బయటపడుతున్నాయి. బాహుబలి సినిమాకు ముందు మన తెలుగు సినిమా మ్యాటర్ కేవలం 50కోట్ల వరకే మాత్రమే ఉండేది.
అంటే దాదాపుగా 50కోట్ల బడ్జెట్ తో సినిమా వచ్చింది అంటే ఆది భారీ సినిమా అని అర్ధం. కానీ బాహుబలి సినిమాని 125కోట్లతో తీసిన రాజమౌళి మన టాలీవుడ్ రేంజ్ ను అమాంతంగా పెంచేసాడు. అయితే అదే క్రమంలో బాహుబలి-1కి చాలా క్రమశిక్షణతో, హద్దులు గీసుకుని పనిచేసాడట మన దర్శక ధీరుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాను చేస్తున్న బాహుబలి-2కి మాత్రం అవేమి లేవంట…హదులన్నీ చెరిపేసి….మరీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు మన జక్కన్న…అందులో భాగంగానే ఈసినిమా తొలి భాగం క్లైమాక్స్ కోసం 1000 మంది జూనియర్ ఆర్టిస్టులను మాత్రమే వినియోగించిన రాజమౌళి ‘బాహుబలి 2’ క్లైమాక్స్ విషయంలో ఏకంగా 5 వేల మంది జూనియర్ ఆర్టిస్టులను వినియోగిస్తున్నట్లు టాక్.
ఎలా అయినా..సరే…ఏ విషయంలోనూ రాజీపడకుండా ప్రపంచ స్థాయి సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా ‘బాహుబలి-2’ క్లైమాక్స్ ఉండాలని రాజమౌళి చాల గట్టి పట్టుదల పై ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరి అంత కష్ట పడుతున్న జక్కన్నకు బాహుబలి-2 ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.