Baahubali: బాహుబలి తరహా సినిమాలు ఆక్కడ సక్సెస్ కావట్లేదా?

కలెక్షన్ల విషయంలో బాక్సాఫీస్ వద్ద బహుబలి2 సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. దేశవ్యాప్తంగా కలెక్షన్ల విషయంలో దంగల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా ఆ కలెక్షన్లలో చైనా నుంచి దంగల్ కు ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ కలెక్షన్ల విషయంలో బాహుబలి2 నంబర్1 అని చాలామంది భావిస్తారు. అయితే ఇప్పట్లో భారత్ లో మరే సినిమా బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేయలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.. బాహుబలి2 రిలీజ్ సమయానికి ఓటీటీల హవా లేదు.

ఈ సినిమా విడుదలైన తర్వాత చాలారోజుల పాటు థియేటర్లలో ఈ సినిమాను చూడటానికి టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. లాంగ్ రన్ కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది. హిందీలో ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమా కూడా విడుదలైన రెండు నెలల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు బాహుబలి తరహా సినిమాలను తెరకెక్కించడానికి బాలీవుడ్ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోవడం లేదు. బాలీవుడ్ ప్రేక్షకులు వరుసగా బాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలకు షాకులిస్తున్నారు. టికెట్ రేట్లు అంతకంతకూ పెరుగుతుండటం కూడా బాలీవుడ్ సినిమాలకు మైనస్ అవుతోంది. తాజాగా బాలీవుడ్ లో అక్షయ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా విడుదల కాగా ఈ సినిమాకు ఓపెనింగ్స్ దారుణంగా వచ్చాయి. తొలిరోజు ఈ సినిమా కేవలం 5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

ఎన్నో ప్రత్యేకతలు ఉన్నా ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. బాహుబలి తరహా సినిమాలు బాలీవుడ్ లో సక్సెస్ సాధించడం లేదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సౌత్ సినిమాలను టార్గెట్ చేసి కాకుండా మంచి కథ, కథనాలతో సినిమాలను తెరకెక్కిస్తే బాలీవుడ్ సినిమాలు సక్సెస్ సాధించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags