దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించడానికి పడిన కష్టాన్ని గురించి రాయాలంటే ఎన్ని పేజీలు అవసరమవుతాయో.. అన్ని పేజీలు ఆ మూవీ సాధించిన రికార్డ్స్ రాయడానికి సరిపోతాయి. అన్ని రికార్డ్స్ ని బాహుబలి మూవీ నమోదు చేసింది. చేస్తూనే ఉంది. 20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1500 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం అదే ఉత్సాహంతో దూసుకుపోతోంది. దేశంలో 400 కోట్ల క్లబ్ ను ప్రారంభించిన చిత్రంగా రికార్డ్ సృష్టించిన ఈ మూవీ.. రిలీజ్ అయిన దగ్గర నుంచి 18 రోజుల్లోనే 1,168 కోట్ల గ్రాస్ రాబట్టింది. కేవలం హిందీ వెర్షన్ దేశవ్యాప్తంగా 450 కోట్లు వసూలు చేసి భారీ కలక్షన్స్ సాధించిన సినిమాగా మొదటి స్థానాన్ని ఆక్రమించింది.
బాహుబలి తర్వాత స్థానాల్లో దంగల్, పీకే, భజరంగీ భాయ్ జాన్, సుల్తాన్ నిలబడగా 6వ స్థానంలో కూడా బాహుబలి 2 మూవీ ఉండడం విశేషం. అదెలా అంటే బాహుబలి 2 తెలుగు వెర్షన్ 300 కోట్లకు పైగా రాబట్టింది. ఆ విధంగా భారీ కలక్షన్స్ సాధించిన భారతీయ టాప్ టెన్ చిత్రాల్లో బాహుబలి2 తెలుగు వెర్షన్ ఆరవ స్థానంలో నిలిచింది. ఇదే జాబితాలో బాహుబలి ది బిగినింగ్ తెలుగు వెర్షన్ 225 కోట్ల నెట్ వసూళ్లతో 8వ స్థానంలో నిలిచింది. టోటల్ ఇండియా కలెక్షన్స్ టాప్ 10 జాబితాలో కేవలం తెలుగు వెర్షన్ వరకే రెండు సార్లు నిలిచిందంటే.. బాహుబలి ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తోందో అర్ధమవుతోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.