బాహుబలి మన ఇండియాలో ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అదే క్రమంలో ఈ సినిమా ఎన్నెన్నో రికార్డులు నెలకొల్పి ఆల్‌రెడీ ఉన్న రికార్డ్స్ కు చుక్కలు చూపించింది. అయితే ఇదంతా ఇండియాకి మాత్రమే పరిమితం అంటున్నాయి మీడియా వర్గాలు..ఎందుకంటే చైనాలో బాహుబలి సినిమాకి గట్టి షాక్ తగిలింది అన్న వార్తలు ఇప్పుడు హల్‌చల్ చేస్తూ ఉన్నాయి. అసలు మ్యాటర్ ఏంటి అంటే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు నీరాజనం పడుతున్న ‘బాహుబలి 2’ ను చైనాలో విడుదల చేసేందుకు ఈసినిమా గతకొద్ది రోజులుగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ‘బాహుబలి 2’ చిత్రంపై చైనాలో అంతగా స్పందన కనిపించడంలేదని తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వార్త. అయితే బాలీవుడ్ ‘మిస్టర్ ఫర్ఫెక్ట్’ అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం చైనాలో చరిత్ర సృష్టించిన నేపధ్యంలో అదే మ్యాజిక్ ను రిపీట్ చేద్దామని ‘బాహుబలి 2’ నిర్మాతలు గత కొద్ది రోజులుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వారి ప్రయత్నాలు అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళడం లేదు.
విదేశీగడ్డ పై 1000 కోట్ల కలెక్షన్లు వసూలు చేసిన తొలిచిత్రంగా ‘దంగల్’ ఇప్పటికే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. చైనాలో సాధారణ ప్రేక్షకుల నుంచి ఆదేశ అధ్యక్షుడి వరకు ‘దంగల్’ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అదే క్రమంలో చైనాలో ‘దంగల్’ ప్రభంజనం తర్వాత ‘బాహుబలి 2’ ను రాబోతున్న సెప్టెంబర్ లో చైనాలో విడుదల చేయబోతున్నారు. అయితే మన భారత సినిమా అయిన బాహుబలిని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు కొనడానికి ఆశక్తికనబరచక పోవడంతో అసలు తలనొప్పి అక్కడే మొదలయింది. ఇక అసలు కారణం ఏంటి, బాహుబలిపై అక్కడి వాళ్ళు ఎందుకు ఆసక్తి కనపరచడంలేదు అంటే….‘బాహుబలి 2’ కు మించిన భారీ సాంకేతిక విలువలు ముఖ్యంగా గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వంటి అత్యంత సాంకేతిక విలువలు ఉన్న అనేక సినిమాలను ఇప్పటికే అక్కడ చూసేసారట…అందుకే ఈ సినిమా అంటే పెద్దగా ఎవ్వరూ పట్టించుకోవడంలేదు. మొత్తంగా అదీ మ్యాటర్.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.