జూన్ 24న చైనాలో బాహుబలి రిలీజ్

జాతీయ ఉత్తమ చిత్రం అవార్డును అందుకున్న బాహుబలి (ది బిగినింగ్) చిత్రం మరిన్ని దేశాల్లో రిలీజ్ కు సిద్ధమైంది. అంతర్జాతీయ స్థాయిలో ఇదివరకు రిలీజ్ చేసినా.. ప్రపంచ సినీ అభిమానుల కోరిక మేరకు ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేయడానికి చిత్రానికి ఆయా భాషల్లో డబ్బింగ్ ను పూర్తి చేశారు. వచ్చే నెల జూన్ లో 24న చైనా లోని 600 థియేటర్లలో బాహుబలి (ది బిగినింగ్) ని విడుదల చేయడానికి రెడీ అయినట్లు చిత్ర యూనిట్ చెప్పింది. ఇది ఆసియా లోనే పెద్ద రిలీజ్ గా సినీ రికార్డ్ ల్లోకి ఎక్కనుందని తెలిపింది. ఈ సారి సినిమా రన్ టైం ను ఇదివరకు ఉన్న నిడివి కంటే 20 నిముషాలు తగ్గించినట్లు స్పష్టం చేసింది. ఆయా దేశాల్లో విదుదలయ్యే సినిమాల రన్ టైం ను దృష్టిలో పెట్టుకుని పాటలను, కొన్ని సన్నివేశాలను కుదించినట్లు వెల్లడించింది.

ప్రభాస్, తమన్నా, అనుష్క, సత్యరాజ్ నటనకు, కీరవాణి సంగీతానికి విజువల్ ఎఫెక్ట్స్ మేళవించి రాజమౌళి సృష్టించిన అద్భుత కళాఖండం బాహుబలి (ది బిగినింగ్) చైనీయులను కూడా అలరిస్తుందని చిత్ర బృందం నమ్మకంతో ఉంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ప్రభాస్ మండరియన్ భాషలో మాట్లాడాడు. ఆ భాషలోనే బాహుబలి గురించి చెప్పి అక్కడి వారిని కూడా అభిమానులుగా చేసుకోబోతున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus