మహేష్ స్పైడర్ పనిలో దిగిన బాహుబలి బృందం

బాహుబలి కంక్లూజన్ విజయంలో మకుట గ్రాఫిక్స్, కమల్ కన్నన్ బృందానికి భాగస్వామ్యం ఉంది. వారు సమకూర్చిన  విజువల్ ఎఫెక్ట్ లు, సిజి వర్క్ లను ఎవరూ వేలెత్తి చూపించడం లేదు. పైగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. వారి వర్క్ నచ్చిన మురుగదాస్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న స్పైడర్ చిత్రానికి హంగులు జోడించమని కోరారు. అందుకు వారు కూడా ఒక కండిషన్ మీద ఒకే చెప్పిన్నట్లు తెలిసింది. ఆ కండిషన్ ఏమిటంటే తమని హడావుడి చేయకూడదని, తమకు తెలియకుండా రిలీజ్ డేట్ ప్రకటించవద్దని చెప్పారంట.

ఆ కండిషన్ కి మురుగదాస్ ఒప్పుకొని పని అప్పగించినట్లు సమాచారం. ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చివరి షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. నిన్నటి వరకు కుటుంబసభ్యులతో కలిసి గోవా టూర్ లో ఎంజాయ్ చేసిన ప్రిన్స్ నేటి నుంచి షూటింగ్ లో పాల్గొన్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పీ, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ వందకోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టులో రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus