Baahubali: ‘బాహుబలి రీ రిలీజ్’ బిగ్ రికార్డ్.. ఆ రెండు అడ్డుపడతాయా?

‘బాహుబలి’ మేనియాకు దశాబ్దం దాటినా, రాజమౌళి చెక్కిన శిల్పానికి ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని ‘బాహుబలి: ది ఎపిక్’ రీ రిలీజ్ ప్రూవ్ చేసింది. అక్టోబర్ 31న రెండు భాగాలను కలిపి విడుదల చేసిన ఈ వెర్షన్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నిర్ణయం భారీ విజయం సాధించింది.

Baahubali

రీ రిలీజ్ చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టిస్తూ, ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 220 నిమిషాల (దాదాపు 4 గంటలు) నిడివి ఉన్నా, సినిమాకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. ‘మాస్ జాతర’ వంటి కొత్త సినిమాలు వచ్చినా, ‘బాహుబలి’ వీకెండ్ ఆక్యుపెన్సీ చాలా బలంగా ఉంది.

రీ రిలీజ్‌లలో ఇదే ఆల్టై మ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలవడం ఖాయం. కానీ అసలు ప్రశ్న.. ఈ చిత్రం 100 కోట్ల మ్యాజికల్ మార్క్‌ను అందుకుంటుందా? అనేది. ప్రస్తుత ట్రెండ్ చూస్తే సాధ్యమే అనిపించినా, దానికి పెద్ద అడ్డంకి ఉంది.

నవంబర్ 7న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (రష్మిక), ‘జటాధర’ (సుధీర్ బాబు) చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు, మోస్తరు హైప్ ఉన్నాయి.

ఒకవేళ ఆ రెండు కొత్త చిత్రాలకు డీసెంట్ టాక్ వస్తే, ‘బాహుబలి: ది ఎపిక్’ జోరుకు రెండో వారాంతంలో కచ్చితంగా బ్రేక్ పడుతుంది. కలెక్షన్లలో పెద్ద డ్రాప్ కనిపిస్తుంది. ఒక రీ రిలీజ్ సినిమా 100 కోట్లు కొట్టడం చాలా పెద్ద అచీవ్‌మెంట్, కానీ ఈ కొత్త పోటీని తట్టుకోవడం కష్టమే. కాబట్టి, ప్రస్తుతానికి ఆ ఫీట్ అసాధ్యంగానే కనిపిస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus