‘బాహుబలి’ తో తెలుగు సినిమా స్టాటిస్టిక్స్ ని, డైనమిక్స్ ని మార్చేశారు రాజమౌళి. లాంగ్వేజ్ బారియర్స్ అనేవి లేకుండా తుడిచేసాడు. తెలుగు సినిమా గురించి చెప్పుకోవాలి అంటే ‘బాహుబలి’ కి ముందు ‘బాహుబలి’ కి తర్వాత అనేలా మార్చేశారు. ఇండియన్ సినిమాల్లో తొలి వెయ్యి కోట్ల సినిమా అంటే ‘బాహుబలి 2’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి అంటే.. దానికి కారణం కూడా ‘బాహుబలి’నే..! అలాంటి ‘బాహుబలి’ ని రీ రిలీజ్ చేస్తే ఫలితం ఎలా ఉంటుంది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కాకపోతే ఆడియన్స్ కి ఈసారి కంప్లీట్ ఫీల్ ఇచ్చేందుకు ‘బాహుబలి’ ‘బాహుబలి 2’ సినిమాలను కలిపేసి ‘బాహుబలి – ది ఎపిక్’ గా (Baahubali-The Epic) గా అక్టోబర్ 31న రీ రిలీజ్ చేశారు. దీనికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీ రిలీజ్ సినిమా,10 ఏళ్ళ క్రితం సినిమా అనే తేడా లేకుండా ఓ కొత్త సినిమాని ఆదరించినట్లు ‘బాహుబలి’ ని మళ్ళీ ఆస్వాదిస్తున్నారు ప్రేక్షకులు. వీక్ డేస్, రీ- రిలీజ్ సినిమా అనే తేడా లేకుండా మొదటి వారం మంచి వసూళ్లు సాధించింది ‘బాహుబలి ది- ఎపిక్’.
ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే:
| నైజాం | 8.91 cr |
| సీడెడ్ | 2.06 cr |
| ఆంధ్ర(టోటల్) | 7.20 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 18.17 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 9.83 cr |
| ఓవర్సీస్ | 11.50 cr |
| మిగిలిన వెర్షన్లు | 9.17 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 48.67 కోట్లు (గ్రాస్) |
‘బాహుబలి – ది ఎపిక్’ (Baahubali-The Epic) సినిమా మొదటి వారం ప్రపంచవ్యాప్తంగా రూ.48.67 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అన్ని భాషల్లో ఉన్న ప్రేక్షకులందరూ ‘బాహుబలి’ ని మరోసారి బిగ్ స్క్రీన్ పై ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు.చూస్తుంటే 2వ వీకెండ్ కూడా ఈ సినిమా నిలబడేలా కనిపిస్తుంది.