సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన #బాహుబలి 2

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమోళి తెరకెక్కించిన అద్భుత కళాఖండం బాహుబలి కంక్లూజన్ గురించి రోజుకో వార్త హాట్ టాపిక్ అవుతోంది. కలక్షన్స్.. అవార్డులతో బ్రేకింగ్ న్యూస్ గా మారిన ఈ చిత్రం ఇప్పుడు సరికొత్త రికార్డులతో వార్తల్లో నిలుస్తోంది.  కొన్ని రోజుల క్రితం “స్టార్ మా”లో ప్రసారమైన బాహుబలి 2 22.7 TVR సాధించి..  తెలుగు  టెలివిజన్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక  టెలివిజన్ వీవర్స్ రేటింగ్ (టీవీఆర్)  అందుకుంది.  అలాగే 2017లో గూగుల్‌ ప్లేలో అత్యధికంగా వీక్షించిన పాటగా “సాహోరే బాహుబలి” రికార్డుకెక్కింది.  గేమ్‌ విభాగంలో స్థానికంగా రూపొందించిన ‘బాహుబలి: ది గేమ్‌’ టాప్‌ లో నిలిచింది.

ఈ ఏడాది భారత్‌లో అత్యధికంగా ఉపయోగించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ట్యాగ్‌గా(#baahubali2) నిలిచింది. ఏడాది పూర్తవుతోన్న సందర్భంగా ట్విటర్‌ ఇండియా ఈ విషయాన్ని ప్రకటించింది. దీన్ని చిత్ర బృందం సోషల్‌మీడియా వేదికగా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేసింది. ‘జై మాహిష్మతి’ అంటూ ట్వీట్‌ చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో ‘బాహుబలి 2’ తర్వాత ‘బీబీ11’ (బిగ్‌బాస్‌ 11), ‘మెర్సల్‌’ ట్యాగ్‌లను నెటిజన్లు అత్యధికంగా వినియోగించారు. వచ్చే ఏడాది అనేక వేదికలపై.. అనేక విభాగాల్లో బాహుబలి కంక్లూజన్ అవార్డులు అందుకోనుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus