Baahubali3 Vs RRR2: బాహుబలి3, ఆర్ఆర్ఆర్2.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ప్రస్తుతం మహేష్ సినిమాపైనే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. మరో రెండున్నర సంవత్సరాల పాటు రాజమౌళి ఈ సినిమాకు పరిమితం కానున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను రాజమౌళి మరింత గ్రాండ్ గా తీస్తున్నారని సమాచారం అందుతోంది. అయితే ఈ సినిమా పూర్తైన వెంటనే రాజమౌళి బాహుబలి3, ఆర్ఆర్ఆర్2 సినిమాలలో ఒక సినిమాను తెరకెక్కించనున్నారు. బాహుబలి3 సినిమాకు ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారో

ఆర్ఆర్ఆర్2 సినిమాకు అదే స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రెండు సినిమాలలో ఏ సినిమాను తెరకెక్కించినా కనీసం 500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. రాజమౌళి మాత్రం ఆర్ఆర్ఆర్2 సినిమాపైనే ఎక్కువగా దృష్టి పెట్టనున్నారు. ఆర్ఆర్ఆర్2 సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గుర్తింపుతో పాటు అవార్డులను తెచ్చిపెట్టింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభాస్ ఒక సినిమా కోసం మూడేళ్లు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు.

ప్రభాస్ డేట్లు ఇస్తానని చెప్పినా ప్రభాస్ తో సినిమాలు తీస్తున్న ఇతర నిర్మాతలు ఒప్పుకునే ఛాన్స్ లేదు. రాజమౌళి ప్లానింగ్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లు మాత్రం ఆయన సొంత బ్యానర్ లో తెరకెక్కనున్నాయి. రాజమౌళి వరుస విజయాలతో ఇండస్ట్రీలో దూసుకెళుతున్నారు. ఇతర స్టార్ డైరెక్టర్లు కూడా రాజమౌళి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నారు.

ఎప్పటికప్పుడు టెక్నాలజీ పరంగా అప్ డేట్ అవుతుండటం రాజమౌళికి ఒక విధంగా ప్లస్ అవుతోంది. వయస్సు పెరుగుతున్నా జక్కన్న సినిమాను సక్సెస్ చేయడం కోసం పడుతున్న కష్టం అంతాఇంతా కాదు. ఊహించని రేంజ్ లో టార్గెట్లను ఫిక్స్ చేసుకుని ఆ టార్గెట్లను అందుకోవడానికి రాజమౌళి రేయింబవళ్లు కష్టపడుతున్నారు.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus