మహేష్, ప్రభాస్, పవన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన బాబా సెహగల్!

మెగాస్టార్ చిరంజీవి రిక్షావోడు సినిమాలో “రూప్ తేరా మస్తానా” అనే పాటతో సింగర్ బాబా సెహగల్ తెలుగువారికి పరిచయమయ్యారు. పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాలో “సరిగమ పదనిసా” అనే పాటతో పాపులర్ అయ్యారు. ఈ మధ్య ఉత్తరాది సినిమాలతో బిజీ అయిన బాబా సెహగల్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అనేక విషయాలను వెల్లడించారు. “నాకు తెలుగు అంతగా రాదు. ఎక్కడైనా మాట్లాడాలన్నా, ఈవెంట్స్ లో పాల్గొనాలి అనుకున్నా, చెప్పాల్సిన విషయాన్ని ఓ కాగితంపై రాసుకుని వెళతాను” అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ “ప్రభాస్ చాలా ఫ్రెండ్లీ, సింపుల్ గా ఉంటూ అందరితో కలిసిపోతారు.

ప్రభాస్ ఎప్పుడు తన దగ్గరకు వచ్చినా ‘హలో బాబా.. ఎలా ఉన్నారు?’ అంటూ ప్రేమతో మాట్లాడుతారు” అని ప్రభాస్ తో అనుబంధాన్ని బాబా చెప్పారు. అంతటితో ఆగకుండా.. ” పవన్ కల్యాణ్ పాటలు ఎక్కువగా పాడడం కారణంగానే నాకు పవర్ సింగర్ అనే పేరు వచ్చింది. ప్రభాస్, అల్లు అర్జున్, పవన్, చిరంజీవి, రవితేజ కోసం పాటలు పాడాను. మహేశ్ బాబుకు మాత్రం ఇంతవరకూ పాట పాడలేదు” అని వెల్లడించారు. అందుకే మీడియా ముఖంగా “మహేశ్ గారూ, నాకు మీ సినిమాలో ఓ అవకాశం ఇవ్వండి” అని సెహగల్ కోరారు. మరి మహేష్ అవకాశం ఇస్తారా? లేదా? అనేది.. త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus