Prithiveeraj, Rukmini: పెళ్లి జరిగి ఏడాదికే విడాకులు తీసుకుంటున్న పృధ్విరాజ్?

దక్షిణాది సిని ఇండస్ట్రీలో నటుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు పృథ్విరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తెలుగులో ఎన్నో సినిమాలలో హీరోగాను, విలన్ పాత్రలలోను అద్భుతమైన నటనను కనపరిచారు. ఇక తాజాగా ఈయన యానిమల్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి పృద్వి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుసు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఇలా కెరియర్ పరంగా సక్సెస్ అయినటువంటి ఈయన తన వ్యక్తిగత విషయంలో మాత్రం కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఈయన మొదట బీనా అనే మహిళను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా జన్మించారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి పృద్వి 56 సంవత్సరాలలో 23 సంవత్సరాల రుక్మిణి శీతల్ అనే మహిళతో రిలేషన్ లో ఉండి గత ఏడాది వివాహం చేసుకున్నారు.

ఇలా వీరిద్దరూ వివాహం చేసుకున్నారనే విషయం తెలియడంతో ఎంతోమంది విమర్శలు కూడా కురిపించారు. కూతురు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ విమర్శలు రాగా ఈయన కూడా ప్రేమకు వయసు లేదంటూ ఈ విమర్శలకు చెక్ పెట్టారు. ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఏడాది కూడా గడవకముందే విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారకంగా తెలియచేయకపోయినా శీతల్ తన సోషల్ మీడియా ఖాతాలో పృథ్వి (Prithiveeraj) తనకు ప్రపోజ్ చేసినటువంటి వీడియోలు తనతో ఉన్నటువంటి ఫోటోలను కూడా డిలీట్ చేశారు.

ఇలా వీటన్నింటినీ డిలీట్ చేయడంతో ఇద్దరు మధ్య మనస్పర్ధలు వచ్చాయని విడాకులు కూడా తీసుకోబోతున్నారన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా కొంతమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడానికి ముందు ఇలా సోషల్ మీడియాలో తమ ఫోటోలన్నింటినీ కూడా డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus