Babloo Prithiveeraj: సూర్య స్వార్థపరుడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పృథ్వీ!

కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు సూర్య ఒకరు ఈయన తమిళ హీరో అయినప్పటికీ తెలుగు హీరో మాదిరిగా ఇక్కడ కూడా ఈయనకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారని అందరికీ తెలిసిందే. ఇలా నటుడిగా తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన గురించి తాజాగా సీనియర్ నటుడు పృథ్వి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. యానిమల్ సినిమాలో కీలకపాత్రలో నటించినటువంటి నటుడు పృథ్వి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన సూర్య గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సూర్య గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి.బబ్లూ పృథ్వీరాజ్.. సూర్య భయంకరమైన వ్యక్తి అని అతను చాలా స్వార్థపరుడు అంటూ తెలియజేశారు కానీ ఏ విషయంలోనైనా చాలా నిబద్ధత కలిగిన నటుడు అంటూ తెలిపారు.

ఇక ఇండస్ట్రీలో సూర్య కెరియర్ కూడా ముగిసినట్టే అంటూ ఈ సందర్భంగా (Babloo Prithiveeraj) ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు సూర్య ఫ్యాన్స్ ఈయనపై ఫైర్ అవుతున్నారు. సూర్య స్వార్థపరుడు ఏంటి ఆయన ఎంతోమందికి ఎలాంటి స్వార్థం లేకుండా తన ఫౌండేషన్ ద్వారా మంచి జీవితాన్ని కల్పిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక సూర్య ఇప్పుడిప్పుడే పాన్ ఇండియా స్థాయిలో సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాంటి ఆయన కెరియర్ ఎలా ముగుస్తుంది అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలపై సూర్య ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈయన కంగువా సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus