బాహుబలితో పోటీకి దిగుతున్న ఆ బాబు ఎవరో తెలుసా?

బాహుబలి కంక్లూజన్ ఈనెల 28న థియేటర్లోకి వస్తోంది. రాజమౌళి, ప్రభాస్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ చిత్రం రిలీజ్ అయిన నెలరోజుల పాటు తమ చిత్రాలను విడుదల చేసే సాహసం తెలుగు నిర్మాతలు చేయడం లేదు. స్టార్ హీరోలు సైతం నాలుగువారాల తర్వాతే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అటువంటిది బాహుబలి రిలీజ్ అయిన వారంలోనే థియేటర్లోకి రాబోతున్నాడు ఈ బాబు. అతనే శ్రీనివాస్ అవసరాల. శృంగారానికి బానిసైన కుర్రోడిగా శ్రీని నటించిన అడల్ట్ కామెడీ చిత్రం ‘బాబు బాగా బిజీ’ మే 5 న థియేటర్లోకి రానుంది.

దీంతో బాహుబలి చిత్రానికి పోటీగా రిలీజవుతున్న ఒకే ఒక సినిమాగా ఇది నిలవనుంది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై నవీన్ మేడారం డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకుంది. శ్రీముఖి, తేజస్వి, మిస్తీ చక్రవర్తి , సుప్రియలు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ బాహుబలికి ఏ మాత్రం పోటీనిస్తుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus