Babu Mohan: చిన్ననాటి కష్టాలను తలుచుకొని వేదికపై కన్నీళ్లు పెట్టుకున్న బాబు మోహన్;

బాబు మోహన్ తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఎన్నో సినిమాలలో అద్భుతమైన కామెడీ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించినటువంటి ఈయన ఎన్నో అవార్డులను పురస్కారాలను కూడా అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్న బాబు మోహన్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా సినిమాలకు దూరమైనటువంటి బాబు మోహన్ రాజకీయాలలో బిజీగా ఉన్నారు ఇలా రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే జీ తెలుగులో ప్రసారమవుతున్నటువంటి డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో చిన్నారులు ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడుకున్నటువంటి స్కిట్ చేశారు ఇది చూసినటువంటి (Babu Mohan) బాబు మోహన్ ఏకంగా కన్నీళ్లు పెట్టుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు.

అనంతరం తన జీవితంలో జరిగిన చిన్నప్పటి చేదు సంఘటనలను గురించి కూడా ఈయన అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా బాబు మోహన్ మాట్లాడుతూ…నేను మూడో తరగతి చదువుతున్న సమయంలోనే తన తల్లి మరణించిందని అప్పటికి నాకు ఒక చెల్లి కూడా ఉండేదని తెలిపారు. తల్లి లేకపోవడంతో చెల్లికి తానే తల్లిగా మారి అన్ని పనులు చేసే వాడినని తెలిపారు.

అమ్మ చనిపోవడంతో నాన్న కూడా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ సమయంలో మేము మా బాధను ఎవరికి చెప్పాలో కూడా తెలియని పరిస్థితి మాది అంటూ ఈ సందర్భంగా చిన్ననాటి చేదు జ్ఞాపకాలను తలుచుకొని ఎమోషనల్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus