సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాల్లో నటిస్తే వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని వార్తలు రావడం సర్వసాధారణం. అయితే ఇలాంటి వార్తలు పెద్ద ఎత్తున వినిపించడంతో ఆ హీరో హీరోయిన్ల జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి వార్తలు కారణంగా విడిపోయిన జంటలు ఎంతో మంది ఉన్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వార్తలను కొట్టి పారేస్తూ ఉంటారు.
ఇదిలా ఉండగా తాజాగా ఇలాంటి ఘటన ఇండస్ట్రీలో ఒకటి చోటుచేసుకుంది. ఒక హీరోయిన్ కారులో వెళ్తుండగా ఆమెను చూసిన మరొక హీరో భార్య ఏకంగా తనని జుట్టు పట్టుకొని బయటకు లాగడమే కాకుండా తనపై దారుణంగా దాడి చేసింది. మరి ఏ హీరోయిన్ పై ఏ హీరో భార్య దాడి చేసింది? ఆమె అలా దాడి చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే…
ఒరియా నటుడు బబుసన్ మేహంతి ఇదివరకే ప్రకృతి మిశ్రా అని హీరోయిన్ తో కలిసి పలు సినిమాలలో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఎంతో మంచి స్నేహబంధం ఏర్పడింది. ఈ స్నేహబంధంతో తరచూ మాట్లాడుతూ ఉండగా నటుడు బబుసన్ భార్యకు మాత్రం వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే సందేహం కలిగింది. దీంతో వీరిద్దరిపై ఆమె ఆగ్రహం పెంచుకుంటూ పోయింది.
తాజాగా భువనేశ్వర్ నగరంలో నటి ప్రకృతి మిశ్రా కారులో ప్రయాణం చేస్తుండగా ఆమెకు నటుడు బబుసన్ భార్య ఎదురు వెళ్లి తన కారును ఆపింది.ఈ విధంగా తను కారు ఆపడమే కాకుండా కారులో నుంచి నటి ప్రకృతిని జుట్టు పట్టి బయటకు లాగి బయటకు ఈడ్చింది. ఆమె ఎంత వదిలించుకున్నా కూడా నటుడి భార్య ఆమె జుట్టూ వదలకపోవడంతో పెద్ద ఎత్తున అక్కడికి అందరూ గూమి గూడారు.ఇలా ఎంతసేపటికి ఆమె హీరోయిన్ జుట్టూ వదలకపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వీరి మధ్య గొడవను సర్దుమనిచారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.